పంజాబ్ క్యాబినెట్ ఒక కొత్త రికమెండేషన్‌ను కేంద్రానికి పంపించడానికి సిద్ధమైంది. రోజు రోజుకీ పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియా ముఠాలు పెరిగిపోతుండడంతో వాటికి అడ్డుకట్ట వేయాలని భావించిన ప్రభుత్వం ఓ సరికొత్త విధానంతో ముందుకొచ్చింది. డ్రగ్స్ అమ్మేవారితో పాటు డ్రగ్స్‌ను దేశంలోకి స్మగుల్ చేస్తూ తీసుకొచ్చే వారికి కచ్చితంగా మరణశిక్ష విధించాలని సర్కార్ కోరింది.
ఈ డ్రగ్స్ వాడడం వల్ల ఎంతోమంది యువకుల జీవితాలు నిర్వీర్యం అయిపోతున్నాయని.. క్షణికమైన ఆనందం కోసం వారు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని క్యాబినెట్ తెలిపింది. ఈ రికమెండేషన్ పంపించడానికి జరిగిన క్యాబినెట్ సమావేశానికి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అధ్యక్షత వహించారు. పంజాబ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చూడాలన్నదే తన కల అని ఆయన తెలిపారు.
ఈ మధ్యకాలంలో పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియాకి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని పదే పదే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న క్రమంలో పంజాబ్ సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే ఆ రాష్ట్రంలో డ్రగ్స్ నిషేధాన్ని కోరుతూ "బ్లా్క్ వీక్ అగేనెస్ట్ చిట్టా" లాంటి నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అడీషనల్ ఛీఫ్ సెక్రటరీ ఎన్ ఎస్ కల్సీ ఆధ్వర్యంలో డ్రగ్స్ మానిటరింగ్ టీమ్ ఏర్పాటు చేసి, మాఫియా చేస్తున్న నేరాలకు అడ్డుకట్ట వేయాలని కోరింది.
My govt has decided to recommend the death penalty for drug peddling/smuggling. The recommendation is being forwarded to the Union government. Since drug peddling is destroying entire generations, it deserves exemplary punishment. I stand by my commitment for a drug free Punjab. pic.twitter.com/dXZTsDwVpf
— Capt.Amarinder Singh (@capt_amarinder) July 2, 2018