Petrol Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Petrol Diesel Price Toay: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ చమురు కంపెనీలు విడుదల చేసిన తాజా ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Written by - ZH Telugu Desk | Last Updated : May 12, 2022, 09:04 AM IST
  • దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు
  • నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న ధరలు
  • ప్రధాన నగరాల్లో ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే...
Petrol Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Petrol Diesel Price Toay: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రోల్ ధర 80 పైసల మేర పెరిగింది. ఆ తర్వాత ధరలు స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. సాధారణంగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను నిత్యం సవరిస్తాయి. సవరించిన ధరలు ఉదయం 6గం. నుంచి అమలులోకి వస్తాయి. ఇవాళ చమురు కంపెనీలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు.. దేశంలోని ఆయా ప్రధాన నగరాల్లో ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం... 

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు : 

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49, డీజిల్ ధర 105.49
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.85, డీజిల్ ధర రూ.100.94
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.12, డీజిల్ ధర రూ.99.83
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51, డీజిల్ ధర రూ.104.77
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.09, డీజిల్ ధర రూ.94.79
భువనేశ్వర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.50, డీజిల్ ధర రూ.102.24
భోపాల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.118.14, డీజిల్ ధర రూ.101.16
చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.74, డీజిల్ ధర రూ.90.83

స్థిరంగా సీఎన్‌జీ ధరలు :

దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు సీఎన్‌జీ ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.71.61గా ఉంది. ముంబైలో రూ. 76,  గురుగ్రామ్‌లో రూ. 79.94, ముజఫర్‌నగర్-మీరట్-షామ్లీ రూ. 78.84, అజ్మీర్-పాలి-రాజ్‌సమంద్ రూ. 81.88గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బ్యారెల్ చమురు ధర :

ఇటీవల గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బ్యారెల్ ముడి చమురు ధర $ 113.46కు చేరింది. దీంతో ఈ ఏడాది పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో రూ.120కి దగ్గరగా ధరలు కొనసాగుతున్నాయి.

Also Read: SVP Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సర్కారు వారి పాట'... ఇట్స్ మహేష్ వన్ మ్యాన్ షో..   

Also Read: Horoscope Today May 12 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి దగ్గరి బంధువు నుంచి శుభవార్త అందుతుంది...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News