న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ కోసం రానున్న రోజుల్లో పెట్రోల్ బంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చేమో అంటే అవుననే తెలుస్తోంది. అవును, తాజాగా విశ్వసనీయవర్గాలు జీ న్యూస్‌కి వెల్లడించిన సమాచారం ప్రకారం పెట్రోల్, డీజిల్ ఇంధనాలను ఇకపై సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ వంటి అన్ని ఇతర వాణిజ్య కేంద్రాల్లో అమ్మకాలు జరిపేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ త్వరలోనే పెట్రోలియం, సహజ వాయువు వనరుల శాఖ ఓ ప్రతిపాదనను కేబినెట్ ముందుకు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
రీటేల్ విక్రయాల్లో పెట్రోల్, డీజిల్‌ను చేర్చాల్సిందిగా కోరుతూ పెట్రోలియం శాఖ తీసుకురానున్న ప్రతిపాదనకు ఒకవేళ కేబినెట్ నుంచి ఆమోదం లభించినట్టయితే, ఇకపై సూపర్ మార్కెట్స్, దుకాణాల్లో కూడా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది.