Viral Video: బాప్ రే.. ఎంపీ ఇంటి ఆవరణలో చిరుత పులి హల్ చల్.. షాకింగ్‌ వీడియో వైరల్..

Leopard enters mp vishweshwar residence: చిరుత పులి ఎంపీ ఇంటి ఆవరణలోకి హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 14, 2025, 04:23 PM IST
  • ఎంపీ ఇంటి ఆవరణలో చిరుత..
  • భయాందోళనకు గురైన స్థానికులు..
Viral Video:  బాప్ రే.. ఎంపీ ఇంటి  ఆవరణలో చిరుత పులి హల్ చల్.. షాకింగ్‌ వీడియో వైరల్..

Leopard enters mp vishweshwar hegde kageri house in Uttara kannada: ఇటీవల కాలంలో చిరుతపులులు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చిరుతలు అడవిలో ఎక్కువగా ఉంటాయి. కొన్ని సార్లు అవి ఆహారం కోసం వేటాడుతూ.. అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లోకి వస్తున్నాయి. ఆ సమయంలో.. అవి మనుషుల మీద కూడాదాడులు చేస్తుంటాయి. ఇటీవల చిరుత పులులు ఇంటి ఆవరణలో ఉన్న పెంపుడు శునకాలు, ఆవులు, గేదెలు, మేకల మీద దాడులు చేస్తున్నాయి.

ముఖ్యంగా చిరుతలు రాత్రి పూట ఎక్కువగా సంచరిస్తుంటాయంటారు. వాటి కళ్లు రాత్రి పూట ఎంతో షార్ప్ గా పనిచేస్తాయంట. కర్ణాటకలోని షిర్సిలో ఒక చిరుత  ఎంపీ ఇంటి ఆవరణలో కన్పించింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

 

కర్ణాటకలో షిర్సి లోని కాగేరి గ్రామంలో చిరుత హల్ చల్ చేసింది. రాత్రిపూట ఎంపీ విశ్వేశ్వర్ హెగ్డే ఇంటి ఆవరణలో ప్రవేశించింది. ఎంపీ ఇల్లు అడవికి దగ్గరగా ఉంటుంది. ఇటీవల ఎంపీ ఇంట్లో .. రాత్రి పూట శునకం కూడా కాపాలా కాస్తుంది. అది చిరుతను చూసి మొరిగింది. ఇంతలో.. చిరుత కుక్కవైపుకు వేగంగా దాడిచేసేందుకు వచ్చింది.

కానీ.. కుక్క మాత్రం.. చిరుతకు చిక్కకుండా.. అక్కడి నుంచి ఇంటి లోపలికి వెళ్లిపోయి తన ప్రాణాలను కాపాడుకుంది. మొత్తానికి చిరుత.. కుక్కమీద దాడిచేసేందుకు వచ్చిన ఘటన అక్కడున్న సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డు అయ్యింది. దీంతో అక్కడున్న వారు.. చుట్టు పక్కల రాత్రి పూటకు బైటకు రావొద్దని కూడా అలర్ట్ ను జారీ చేశారు. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు.

Read more:Viral Video:  వచ్చుండాయ్ పీలింగ్స్ పాటకు అమ్మాయిల ఊరమాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..   

మరొవైపు.. మైసూరులోని ఇన్ఫోసిస్ ప్రాంగణంలో గత 10 రోజులుగా చిరుతపులిని గుర్తించే ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. అదే కారణంతో ఇన్ఫోసిస్ క్యాంపస్‌లోని ఉద్యోగులకు కూడా వర్క్‌ఫ్రంహోమ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News