PSLV C56: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. పూర్తి స్థాయిలో కమర్షియల్ రాకెట్ ప్రయోగాన్ని ఈ నెల 30న చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పీఎస్‌ఎల్‌వి సి 56 రాకెట్ ద్వారా వివిధ దేశాలకు చెందిన 7 ఉప గ్రహాల్ని నింగిలోకి పంపించనుంది. ఈ ప్రయోగం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇస్రోకు ఈ ఏడాది వరుస ప్రయోగాలున్నాయి. ఏప్రిల్ నెలలో పీఎస్‌ఎల్‌వి సి 55 మిషన్, ఇటీవల చంద్రయాన్ 3 ప్రయోగం..ఇప్పుడు త్వరలో పీఎస్‌ఎల్‌వి సి 56 ప్రయోగం. జూలై 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వి సి 56 రాకెట్ ప్రయోగం ఇస్రోకు వాణిజ్యపరంగా లాభించేది కావడంతో అత్యంత జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా ఒకేసారి 7 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపిస్తోంది. సింగపూర్ దేశానికి చెందిన డీఎస్-ఎస్ఏఆర్ శాటిలైట్‌తో పాటు మరో ఆరు ఉపగ్రహాల్ని అంతరిక్షంలో ప్రయోగించనుంది. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల కోసం డీఎస్-ఎస్ఏఆర్ ఉప్రగహాన్ని ప్రయోగించేందుకు ఇస్రోతో ఆ దేశం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతోపాటు టెక్నాలజీ డెమోన్‌స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్ ఏఎం, ఎక్స్‌పెరిమెంటల్ శాటిలైట్ ఆర్కేడ్, 3యూ నానో శాటిలైట్ స్కూబ్ 2, ఐవోటీ కనెక్టివిటీ నానో శాటిలైట్ సూలయన్, గలాసియా 2, ఓఆర్బీ 12 స్ట్రైడర్ శాటిలైట్లను నింగిలోకి పంపించనుంది.
ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అబివృద్ధి చేసిన సింథటిక్ అపెర్చర్ రాడార్ పేలోడ్‌ను డీఎస్-ఎస్ఏఆర్ కలిగి ఉంటుంది. ఇది పూర్తి పోలారిమెట్రీ వల్ల రిజల్యూషన్ ఇమేజ్ చేయగలదు. ఎస్టీ ఇంజనీరింగ్ తమ వాణిజ్య అవసరాల కోసం మల్టీ మోడల్, హై రెస్పాన్సిబిలిటీ ఇమేజరీ, జియో స్పేషియల్ సేవలకు ఉపయోగించనున్నామని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.
Also read: Gyanvapi Case Updates: జ్ఞానవాపి మసీదులో నిలిచిన సర్వే, జూలై 26 వరకూ స్టే విధించిన సుప్రీంకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook