Corona Cases Returns: దేశం ప్రస్తుతం కోవిడ్-19 తో పాటు H3N2 వైరస్ టెన్షన్‌తో ఉంది. అయితే ఇన్ని రోజుల పాటు తక్కువగానే నమోదవుతూ వస్తున్నా కరోనా కేసులు ఒక్కసారిగా మళ్ళీ పెరుగుతున్నాయి. రోజురోజుకు కొత్త కేసులు తెరపైకి వస్తున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో మొత్తం 1,071 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా, రాజస్థాన్ మహారాష్ట్ర, కేరళలలో ఒక్కొక్కరి చొప్పున రోగులు మరణించారు. ఒక రకంగా సుమారు 129 రోజుల తర్వాత అంటే నాలుగు నెలల తరువాత భారతదేశంలో ఒకే రోజులో 1,000 కంటే ఎక్కువ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
ఇక తాజా కేసులతో చికిత్స పొందుతున్న కరోనా రోగుల సంఖ్య 5,915కి పెరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన డేటా ప్రకారం, దేశంలో 24 గంటల్లో మొత్తం 1,071 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. కాగా, ముగ్గురు కరోనా రోగులను కోల్పోవడంతో మరణాల సంఖ్య 5,30,802కి పెరిగింది. ఇక లెక్కల ప్రకారం, భారతదేశంలో మొత్తం ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య 4,46,95,420కి పెరిగింది. అదే సమయంలో, చికిత్సలో ఉన్న రోగుల సంఖ్య మొత్తం ఇన్ఫెక్షన్ కేసులలో 0.01 శాతం కాగా, కోవిడ్-19 నుండి కోలుకునే నేషనల్ రేటు 98.8 శాతంగా నమోదైంది.
వైద్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, కరోనా వైరస్ సంక్రమణ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య 4,41,58,703కు పెరిగింది, ఇక మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. వెబ్సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రచారం కింద, దేశంలో ఇప్పటివరకు 220.65 కోట్ల డోస్‌ల యాంటీ కోవిడ్ -19 వ్యాక్సిన్లు ఇచ్చారు. కోవిడ్-19 ఎక్స్‌బిబి వేరియంట్లోని సబ్-వేరియంట్ ఎక్స్‌బిబి 1.16 గత కొన్ని రోజులుగా భారతదేశంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల వెనుక ముఖ్య కారణం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
వేరియంట్లను పర్యవేక్షించే అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్ చెబుతున్న శుక్రవారం డేటా ప్రకారం, కరోనా XBB 1.16 వేరియంట్ అత్యధిక కేసులను భారతదేశంలోనే నమోదు అయ్యాయి, తాజా నివేదికల ప్రకారం, భారతదేశంలో కరోనా XBB 1.16 వేరియంట్ 48 కేసులు, సింగపూర్‌లో 14, యుఎస్‌లో 15 కేసులు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, ముప్పుగా పరిగణించబడుతోందని అంటున్నారు.
Also Read; Sajjala Comments on MLC Results: వచ్చిన ఓట్లన్నీ TDPవి కావు.. మేము హెచ్చరికగా భావించడం లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook