Jio Airtel Plans: ట్రాయ్ ఇటీవల టెలీకం కంపెనీలకు కొన్ని ఆదేశాలు చేసింది. ఇప్పటి వరకూ డేటా అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. దాంతో సగటు వినియోగదారుడికి భారమయ్యేది. ఈ పరిస్థితిని తప్పించేందుకు ట్రాయ్ కొత్తగా కొన్ని ఆంక్షలు విధించింది. ఓన్లీ వాయిస్, ఎస్ఎంఎస్ కాల్స్ అందుబాటులో తీసుకురావాలని ఆదేశించింది. ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు ఓన్లీ వాయిస్ కాల్స్ ప్రవేశపెట్టాయి. ఇంటర్నెట్ డేటా అవసరం లేనివారికి ఈ ప్లాన్స్ చాలా ఉపయోగకరం. రిలయన్స్ జియో యూజర్ల కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సౌకర్యంతో రెండు ప్లాన్స్ ప్రవేశపెట్టింది.ఇప్పుడు ఆ రెండు ప్లాన్స్ ధరల్ని తగ్గించింది. ముందుగా ఎయిర్‌టెల్ టారిఫ్ తగ్గించడంతో ఇప్పుడు జియో అదే బాటపట్టింది.
ట్రాయ్ ఆదేశాల మేరకు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్‌లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మధ్యనే కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం ఉండే ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్‌లో డేటా ఉండదు. ఇప్పుడు వీటి ధరలు కూడా తగ్గాయి.
జియో 1748 రూపాయల రీఛార్జ్ ప్లాన్
వాస్తవానికి జియో 1758 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టిది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఏడాదికి 365 ఎస్ఎంఎస్‌లు పంపించవచ్చు. ఇప్పుడు కొత్తగా 1748 రూపాయల ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, 360 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి.
జియో 448 రూపాయల రీఛార్జ్ ప్లాన్
జియో 458 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌ను 448 రూపాయలకు తగ్గించింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 1000 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఈ ప్లాన్‌తో డేటా ఏ మాత్రం ఉండదు.
ఇక ఎయిర్‌టెల్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ఉండేలా ప్లాన్ ప్రకటించింది. ఇప్పుడీ ప్లాన్ టారిఫ్ 499 రూపాయల నుంచి 469 రూపాయలు చేసింది. ఇక 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను 1959 రూపాయల నుంచి 1849రూపాయలకు తగ్గించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి