Farmers Protest: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తున్నారు. మూడు రోజులపాటు నిరసనలు కొనసాగనున్నాయి. ఈక్రమంలో సుమారు 10 వేల మంది రైతులు పంజాబ్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరుకున్నారు. లఖింపుర్‌ఖేరీ హింసాత్మక ఘటనల్లో చనిపోయిన, గాయపడ్డ రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు మొత్తం 72 గంటలపాటు నిరసన తెలపనున్నారు. ఆందోళనల్లో రైతు నేతలు రాకేష్ టికాయిత్, దర్శన్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రాహన్‌తోపాటు ఇతర నేతలు పాల్గొననున్నారు. ఆందోళనల్లో 10 వేల మంది రైతులు పాల్గొంటారని భారతి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ రాయ్ వెల్లడించారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న రైతులపై కేసులను ఎత్తివేయాలన్నారు. ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో అఖింపుర్‌ఖేరీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈఘటనలో నలుగురు రైతులతోపాటు మరో నలుగురు మృతి చెందారు.
ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మలి దశ ఉద్యమానికి రైతులు సిద్ధమైయ్యారు. ఈఏడాది జులైలో ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.
సాగు చట్టాల విషయంలో ఎలాంటి విజయం సాధించామో..అదే స్ఫూర్తితో ఆందోళనలు కొనసాగిస్తామని రైతు సంఘ నాయకులు చెబుతున్నారు. ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. తమ రాస్తారోకోలు, ధర్నాలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని..సాగు చట్టాలను రద్దు చేసిందన్నారు. ఇప్పుడు లఖింపుర్ ఖేరీ బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ముందుకు వెళ్తామంటున్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని..బాధితులకు న్యాయం చేయాలంటున్నారు.
Also read:Amaravathi Rythulu: మహా పాదయాత్రకు సిద్ధమవుతున్న అమరావతి రైతులు..ఎప్పటి నుంచి అంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook