NewsClick News: న్యూస్‌క్లిక్‌పై కొనసాగుతున్న దాడులు, ఎడిటర్ ప్రబీర్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

NewsClick News: న్యూస్‌క్లిక్ పోర్టల్‌పై చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు చేసిన ఢిల్లీ పోలీసులు ఇప్పుడు ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 4, 2023, 08:12 AM IST
NewsClick News: న్యూస్‌క్లిక్‌పై కొనసాగుతున్న దాడులు, ఎడిటర్ ప్రబీర్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

NewsClick News: న్యూస్‌క్లిక్ పోర్టల్‌పై ఢిల్లీ పోలీసులు చర్యలు తీవ్రం చేశారు. సంస్థ సిబ్బందిపై, కార్యాలయాలపై దాడులు కొనసాగించారు. చైనా నుంచి నిధులు స్వీకరిస్తున్నారనే ఆరోపణలతో ఆ సంస్థ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ప్రబీర్ పుర్కాయస్థను, హెచ్‌ఆర్ అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. 

చైనా అనుకూల సమాచారాన్ని ఇండియాలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఆ దేశం నుంచి భారీగా నిధులు స్వీకరించిందనేది న్యూస్‌క్లిక్‌పై ఉన్న ఆరోపణ. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు న్యూస్‌క్లిక్ సంస్థ కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లపై ఆకశ్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 100 ప్రాంతాల్లో ఏకకాలంలో 500 మంది పోలీసులు దాడులు కొనసాగించారు. డిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ముంబైల్లో సోదాలు నిర్వహించారు. న్యూస్‌క్లిక్ సంస్థకు నిదులు ఎలా వస్తున్నాయనే కోణంలో గతంలో ఈడీ సైతం సోదాలు చేసింది. అప్పట్లో ఈడీ ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరమయ కుట్ర సెక్షన్ల కింద కొత్తగా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పలువురి నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, హార్డ్ డిస్క్‌లు, ఫ్లాష్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. చైనాతో సంబంధమున్న కొన్ని సంస్థల్నించి గత మూడేళ్లలో 38.05 కోట్ల రూపాయలు న్యూస్‌క్లిక్ సంస్థకు అందినట్టు ఆరోపణలున్నాయి. 

ఈ వ్యవహారంపైనే ఇప్పుడు న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థతో పాటు హెచ్‌ఆర్ ఛీఫ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

న్యూస్‌క్లిక్‌పై దాడులు, ప్రబీర్ అరెస్టును విపక్ష కూటమి ఇండియా నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడేవారిని అణచివేసేందుకు కేంద్రం ఇలాంటి చర్యలు చేపడుతోందని విమర్శించారు. 

Also read: Ram Setu: రామ్‌సేతుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం, అసలేం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News