AAP Freebies: ఢిల్లీలో పోటీ త్రిముఖంగా ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్నా ప్రధాన పోటీ మాత్రం ఆప్ వర్సెస్ బీజేపీ మధ్యనే నడుస్తోంది. అందుకే ప్రజల్ని ఆకట్టుకునేందుకు వివిధ రకాల హామీలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అయితే మరిన్ని ఉచితాలను రూపకల్పన చేస్తోంది.
ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నాలుగోసారి అధికారంలో వచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలో వచ్చేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేయనుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంధించిన మోదీ గ్యారంటీనే ఢిల్లీ కోసం మరోసారి సిద్ధం చేయనుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గ్యారంటీ పేరుతో ఎన్నికలకు సిద్ధమైంది. ఉన్న హామీలకు తోడుగా మరిన్ని ఉచితాలు ప్రకటించనుంది. ఆప్ మేనిఫెస్టోలో 8-10 హామీలు ఉండనున్నాయి. మహిళలకు ఉచిత విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య, తీర్ధయాత్రలు, బస్సు యాత్రతో పాటు మౌళిక సదుపాయాల కల్పన ఉండనుంది. ముఖ్యంగా ఈసారి రెండు ప్రధాన పధకాలు ప్రారంభించేందుకు యోచిస్తోంది. ఆప్ మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పేరుతో రెండు పథకాలు ప్రారంభించనుంది.
కొత్త పథకాలెలా ఉంటాయి
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ప్రయోగించనున్న కొత్త పథకాలు మహిళా సమ్మాన్ యోజన, సంజీవని. మహిళా సమ్మాన్ యోజనలో భాగంగా ఆదాయపు పన్ను చెల్లించనివారిలో మహిళలకు నెలకు 1000 రూపాయల భరణాన్ని 2100 కు పెంచనుంది. ఇక సంజీవని యోజనలో భాగంగా 60 ఏళ్లు పైబడినవారికి ఉచితంగా ఆరోగ్య సంరక్షణ అందించనున్నారు. పూజారి గ్రంథి సమ్మాన్ యోజనలో భాగంగా నెలకు 18 వేల రూపాయలు పూజారులకు వేతనం అందుతుంది.
ఇవి కాకుండా ఆటో రిక్షా డ్రైవర్లకు సామాజిక భద్రతకై మరో పధకం ఉంటుంది. 15 లక్షల విలువైన జీవిత, ప్రమాద బీమా ఉంటుంది. ఇంట్లో ఆడపిల్లల పెళ్లి ఖర్చులకై 1 లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం ఉంటుంది. ఏడాదికి రెండుసార్లు 2500 రూపాయలు యూనిఫాం అలవెన్స్ విద్యార్ధులకు ఇస్తారు. వీటన్నింటితో పాటు నీటి బిల్లుల మాఫీ, స్వచ్ఛమైన తాగునీరు అందించనుంది.
Also read: Pushya Masam: 102 ఏళ్ల అరుదైన సంయోగం, ఈ మూడు రాశులకు మహర్దశ నేటి నుంచి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.