India Corona cases: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనాకేసులు ( Coronavirus ) నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు రోజుల నుంచి రికార్డు స్థాయిలో 60వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. అయితే.. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 64,399 కరోనా కేసులు నమోదు కాగా.. 861మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 21,53,011కి పెరిగింది. అదేవిధంగా మొత్తం మరణాల సంఖ్య 43,379కి చేరిందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( health ministry ) ఆదివారం తెలిపింది. Also read: Covid-19: మరో ఇద్దరు కేంద్ర మంత్రులకు కరోనా
ప్రస్తుతం దేశంలో 6,28,847మంది పలు ఆసుపత్రుల్లో, కోవిడ్ సెంటర్లల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14,80,884 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 68.8కి పెరగగా.. మరణాల రేటు 2శాతంగా ఉంది. Also read: Mahesh Babu: టాలీవుడ్ యువరాజుకు హ్యాపీ బర్త్ డే
India: రికార్డు స్థాయిలో కరోనా కేసులు