Corona patients enjoy: ఢిల్లీ : కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి దేశంలో రోజురోజుకీ విస్తరిస్తూనే ఉంది. దీంతో ఆ పేరు తీస్తేనే అందరికీ భయమేస్తోంది. ఈ క్రమంలో క్వారంటైన్ సెంటర్ల పక్కకు వెళ్లాలంటేనే చాలామంది జంకుతుంటుంటారు. దానిలో ఉన్నవారు ఎప్పుడు ఏమవుతుందో అనుకుంటూ.. బాధతో మనోవేదన చెందుతూ కుంగిపోతుంటారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల కోవిడ్-19 సెంటర్లల్లో ఉన్న కరోనా బాధితులు సందడి చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వ్యాధితో మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు వారు తమకు నచ్చినట్లుగా హ్యాపీగా ఉంటున్నారు. వారు పాటలు పాడటం, డ్యాన్స్ చేసి తమతో ఆ సెంటర్లల్లో ఉన్నవారిని కూడా ఉత్సాహ పరుస్తూ క్వారంటైన్ కాలన్ని గడుపుతున్నారు. Also read: IPL 2020: ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?
#WATCH Coronavirus patients dance and sing at a quarantine centre in Dibrugarh, Assam. (23.07.20) pic.twitter.com/SBjtIrSdks
— ANI (@ANI) July 24, 2020
ఈ క్రమంలోనే అస్సాం రాష్ట్రంలోని దిబ్రుగఢ్ జిల్లాలోని ఓ క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న కరోనా బాధితులంతా పాటలు పాడుతూ, స్టెప్పులేశారు. వార్డులో ఒక యువకుడు పిల్లనగ్రోవితో పాట పాడుతుంటే.. మరో ఇద్దరు ముగ్గురు యువకులు కలిసి స్టెప్పులేస్తూ అందరినీ ఉత్తేజపరిచారు. ఇలా వారంతా కలిసి స్టెప్పులేస్తూ కరోనా నుంచి కాస్త ఉపశమనం పొందారు. అయితే.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏది ఏమైనప్పటికీ కరోనా మనసిక ఒత్తిడిని జయించేందుకు వారు ఈ విధంగా సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. Also read: Oxford Vaccine: ఇండియాలో మూడవ ఫేజ్ వ్యాక్సిన్ ట్రయల్స్
Corona patients: చిందేసిన కరోనా బాధితులు