Congress leader kantilal bhuria mahalakshmi scheme 1 lakh to woman double for two wives: ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలలో గెలవాలని ఆయా పార్టీలు ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎంతో మేలు చేస్తామంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల వచ్చాయంటే చాలు. అనేక పార్టీలు ప్రజలను ఆకట్టుకునేలా మెనిఫెస్టోను ప్రకటిస్తాయి. తాము చెప్పిందే చేస్తామంటూ మెనిఫెస్టో పట్టుకుని ప్రచారం నిర్వహిస్తుంటాయి. ఓటరు దేవుడ్ని ప్రసన్నం చేసుకొవడానికి నానాతండాలు పడుతుంటారు. కొందరు నాయకులు ఎన్నికల ప్రచారంలో టిఫిన్ షాపులలో దోశలు వేస్తుంటారు. టీలు చేస్తుంటారు. ఇక స్థానికంగా ఉన్న ఓటర్ల ఇంటికి వెళ్లినప్పుడు మాత్రం.. ఏదో ఒక పనిచేసిపెడుతుంటారు. ఓటరును తమవైపు తిప్పుకునేలా మాట్లాడుతుంటారు. కొందరు ఓట్ల కోసం సీక్రెట్ గా గిఫ్ట్ లు, చీరలు పంచుతుంటారు. మరికొందరు తమకే ఓటు వేయాలని దేవుడి ముందు ప్రమాణంకూడా తీసుకుంటారు. ఎన్నికలు రాగానే అప్పటి వరకు కన్నించని నేతలు.. ఎప్పుడు చూసిన నియోజకవర్గం వీధిలోనే ప్రచారం చేస్తు కన్పిస్తారు. ఓటు కోసం పడరాని పాట్లు పడుతుంటారు.
#WATCH | While addressing a public rally, Congress candidate from Madhya Pradesh's Ratlam, Kantilal Bhuria says, "...After the Congress govt comes to power, what we have written in our constitution, Rs 1 lakh will be credited in the account of every woman, and those who have 2… pic.twitter.com/xzTSXoGzH2
— ANI (@ANI) May 10, 2024
రకరకాల జిమ్మిక్కులు వేస్తుంటారు. ఎన్నికల బహిరంగ ప్రచారంలో ఒక రేంజ్ లో వాగ్దానాలు చేస్తుంటారు. కొన్నిసార్లు నాయకులు తమ హమీలతో ప్రజల ముందుకు వెళ్తుంటారు. కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం జోష్ లో ఎన్నికల నియామవళిని అతిక్రమిస్తుంటారు. మరికొన్ని సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, కేసుల బారిన పడటం, అపోసిషన్ నాయకుల ముందు అభాసుపాలవ్వడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఈకోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భూరియా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. రత్లాం నుండి కాంతిలాల్ భూరియా.. ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు సంవత్సరానికి ₹ 1 లక్ష పథకం ఇస్తామన్నారు. ఇక ఎవరికైన ఇద్దరు భార్యలు ఉంటే ఆ పురుషులు ₹ 2 లక్షలు పొందుతారని పేర్కొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కాంతిలాల్ భూరియా చేసిన వ్యాఖ్యలను వీడియోను.. ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకొవాలని కోరారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పథకాలతో ప్రజలను మభ్యపేట్టే ప్రయత్నాలు చేస్తుందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
Read More: Fish Rain: వావ్.. ఆకాశం నుంచి చేపల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనాలు.. వైరల్ వీడియో..
ఇదిలా ఉండగా.. కాంతిలాల్ భూరియా.. సైలానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో మాట్లాడుతూ..తమ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి మహిళకు ₹ 1 లక్ష హామీ ఇస్తుంది. అది ఆమె బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుందని తెలిపారు. ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తులకు కూడా ఇదే రకంగా 2లక్షల చొప్పున వారి బ్యాంక్ ఖాతాలో జమచేస్తామంటూ ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ ఎలాగైన అధికారంలోకి రావాలని దిగజారీ రాజకీయాలు చేస్తుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై ఈసీ చర్యలు తీసుకొవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మే 13న రత్లాంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter