Mallikarjuna Kharge: లోక్‌సభ ఎన్నికల విషయమై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. పొరపాటున నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికలు అనేవే ఉండవని పేర్కొన్నారు. రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ మాదిరి దేశంలో నియంత పాలనే ఉంటుందని హెచ్చరించారు. కావాల్సి వస్తే దేశ రాజ్యాంగంలో సవరణలు కూడా చేసే అవకాశం ఉందన్నారు. ఇదే మనకు చివరి ఓటు వేసే అవకాశమని తెలిపారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సోమవారం ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో మల్లికార్జున ఖర్గే కీలక విషయాలు మాట్లాడారు. ప్రజలు వాస్తవ పరిస్థితి గ్రహించాలని సూచించారు. చివరిసారి ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్పారు. 'మరోసారి మోదీ ప్రధాని అయితే ఇక ప్రజాస్వామ్యం ఉండదు. ఎన్నికలు ఉండవు. ఉండేదంతా నియంత పాలనే. రష్యాలో వ్లాదిమిర్ పుతిన్‌లాగా దేశంలో నియంత పాలన సాగుతుంది. దీనికి రాజ్యాంగంలో సవరణలు కూడా చేసే అవకాశం ఉంది' అని హెచ్చరించారు. ఇప్పటికే ఆ పరిణామాలు చూస్తున్నామని తెలిపారు.
ये आख़री chance है आप के पास वोट देने का, इसके बाद लोकतंत्र नहीं बचेगा !
संविधान व लोकतंत्र को बचाना और चुनाव बार-बार कराना इसकी ज़िम्मेदारी अब जनता के ऊपर है।
📍भुवनेश्वर pic.twitter.com/sALRwQkM4s
— Mallikarjun Kharge (@kharge) January 29, 2024
కేంద్ర ప్రభుత్వం ప్రతిఒక్కరికీ ఈడీ నోటీసులు పంపుతోందని ఖర్గే తెలిపారు. 'ఈ భయంతోనే కొందరు మిత్రులు వదిలేస్తున్నారు. కొందరు పార్టీని వీడుతున్నారు. మరికొందరైతే కూటమి నుంచి వైదొలుగుతున్నారు' అని వివరించారు. పరోక్షంగా నితీశ్ వ్యవహారంపై ఖర్గే ఇలా వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి వెళ్లిపోతే ఇండియా కూటమికి వచ్చే నష్టమేమి లేదన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ దేశాన్ని ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాడని చెప్పారు. రాహుల్ ప్రేమ దుకాణం తెరవగా.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు ద్వేషపూరిత దుకాణం తెరుస్తున్నారని విమర్శించారు. ఎన్డీయేతో కొనసాగుతున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై ఖర్గే విమర్శలు చేస్తూ.. 'డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏం ఒరిగింది? హామీలు నెరవేర్చడంలో, రాష్ట్ర అభివృద్ధిలో వైఫల్యం చెందారు' అని విమర్శించారు.
Also Read: Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ
Also Read: RS Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook