NEET & JEE Exams: ఆందోళన వద్దు..అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం

కోవిడ్ వైరస్ సంక్రమణ నేపధ్యోల నీట్..జేఈఈ పరీక్షల నిర్వహణ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. చర్చనీయాంశమైంది. అయితే ఆందోళన వద్దని..అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ అంటున్నారు.

Last Updated : Aug 27, 2020, 07:32 PM IST
NEET & JEE Exams: ఆందోళన వద్దు..అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం

కోవిడ్ వైరస్ సంక్రమణ నేపధ్యోల నీట్..జేఈఈ పరీక్షల నిర్వహణ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. చర్చనీయాంశమైంది. అయితే ఆందోళన వద్దని..అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ అంటున్నారు.

ఆందోళనలు, అభ్యంతరాల మధ్య నీట్ , జేఈఈ పరీక్షల్ని నిర్వహించడానికే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అటు సుప్రీంకోర్టు కూడా విద్యా సంవత్సరం వృధా కాకూడదని అభిప్రాయపడుతూ..పరీక్షలకు ఓకే చెప్పింది. దాంతో సామాజిక కార్యకర్త గ్రెటా థన్ బెర్గ్ నుంచి బాలీవుడ్ నటుడు సోనూసూద్ అందరూ ట్వీట్లు చేస్తూ అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. విద్యార్ధుల భద్రత, కెరీర్ రెండూ తమకు ప్రధానమని..అందుకే పరీక్షల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పలు మార్గదర్శకాలు, నిర్ధిష్ట విధానాలు జారీ చేసిందన్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడడిన పరీక్షల నిర్వహణకు మెయిల్ ద్వారా విద్యార్ధులు, తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారన్నారు. విద్యార్ధుల సౌకర్యానికి అనుకూలంగానే పరీక్షా కేంద్రాల్ని ఎన్టీయే ఏర్పాటు చేసిందని మంత్రి చెప్పారు. పరీక్షల కోసం విద్యార్ధులు ఎలాంటి దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 

మరోవైపు జేఈఈ పరీక్షలు రాయనున్న 8 లక్షల 58 వేల విద్యార్ధుల్లో..7 లక్షల 50 వేల మంది హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. నీట్ పరీక్షలకు హాజరయ్యే 15 లక్షల 97 వేలమంది విద్యార్ధుల్లో 10 లక్షల మంది అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకున్నారు. 

Trending News