మధ్యప్రదేశ్లోని గునాలో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరొక 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదం సంభవించింది. బాందా నుంచి అహ్మదాబాద్ మార్గంలో బస్సు .. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును డ్రైవర్ చూసుకోకుండా ఢీకొట్టడంతో ఈ ప్రమదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అపరిశుభ్రమైన నీరు త్రాగి 280 మందికి అస్వస్థత
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో అపరిశుభ్రమైన నీరు త్రాగి 280 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ అత్యవసర చికిత్స అందిస్తున్నామని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కుళాయిల ద్వారా విడుదలైన నీటిని తాగిన వెంటనే వీరందరికీ వాంతులు, వీరేచానాలు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. కాగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.