Uttarakhand Car Accident: ఉత్తరాఖండ్‌లోని రామనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం (జూలై 8) తెల్లవారుజామున 5.45గం. సమయంలో ఓ కారు ప్రమాదవశాత్తు ధేలా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. కారులో చిక్కుకుపోయిన 22 ఏళ్ల మహిళను పోలీసులు స్థానికుల సాయంతో రక్షించగలిగారు.
మృతి చెందినవారిలో నలుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మరో ఐదుగురి మృతదేహాలు కారులోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎంత మంది ఉన్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. వీరంతా పంజాబ్‌లోని పటియాలాకు చెందినవారిగా గుర్తించారు. ఉత్తరాఖండ్ పర్యటన ముగించుకుని తిరిగి పటియాలాకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ధేలా నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉందని డీఐజీ నీలేశ్ ఆనంద్ భరణ్ తెలిపారు. ప్రస్తుతం డెహ్రాడూన్, నైనిటాల్, బాగేశ్వర్, పితోరాఘర్, తెహ్రీ, పౌరీ, చంపావత్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.
#WATCH Uttarakhand | 9 died, 1 girl rescued alive and about 5 trapped after a car washed away in Dhela river of Ramanagar amid heavy flow of water induced by rains early this morning, confirms Anand Bharan, DIG, Kumaon Range pic.twitter.com/Dxd27Di5mv
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 8, 2022
Also Read: Live Murder Video: నడిరోడ్డుపై అరాచకం.. కత్తులతో పొడిచి యువకుడి హత్య... వీడియో వైరల్
Also Read: Sai Pallavi: కాశ్మీరీ ఫైల్స్ కామెంట్స్ మీద సాయి పల్లవికి హైకోర్టు షాక్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook