నేడు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా వాజ్‌పేయి నివాసానికి తరలించారు. రేపు శుక్రవారం ఉదయం 9 గంటలకు వాజ్‌పేయి భౌతికకాయాన్ని పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు వాజ్ పేయి పార్థివదేహానికి నివాళి అర్పించి ఆయన్ను కడసారి చూసుకునేందుకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు బీజేపీ కార్యాలయం నుంచి వాజ్‌పేయి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. రేపు సాయంత్రం 4 గంటలకు స్మృతి స్థల్‌లో వాజ్‌పేయి పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు బీజేపీ అధినాయకత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.
At 9 am tomorrow his mortal remains will be taken to BJP headquarters and at 1 pm his last journey will begin. Funeral will be held at 4 pm at Smriti Sthal: BJP President Amit Shah #AtalBihariVajpayee pic.twitter.com/tYYWwenLbp
— ANI (@ANI) August 16, 2018