How To Change Photo in Aadhar Card: ప్రస్తుతం ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రభుత్వ పథకాలు అందేవరకు ఆధార్ తప్పనిసరి. సిమ్ కార్డు తీసుకోవాలన్నా.. ఆధార్ కార్డు కావాల్సిందే. ఇంత ముఖ్యమైన ఆధార్‌లో ఫొటో సరిగా లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఆధార్ కార్డులో ఫొటోకు.. ఒరిజినల్ లుక్కు చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఆధార్ కార్డును బయట చూపేంచేందుకు ఎక్కువగా ఇష్టపడరు. ఆధార్ కార్డులో ఫొటో ఎలా మార్చుకోవాలో తెలియక చాలామంది తమకు నచ్చని ఫొటోతోనే కంటిన్యూ అవుతుంటారు.
మీరు ఆధార్ కార్డులో ఫొటో మార్చుకోవాలంటే కచ్చితంగా మీ సేవా, ఆధార్ సెంటర్లను సంప్రదించాల్సిందే. ఫొటోతోపాటు మీ బయోమెట్రిక్, పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ కూడా ఒకేసారి అప్డేట్ చేసుకోవచ్చు. ఫొటో తీసే సమయంలో కాస్త స్ట్రైట్‌గా కూర్చొని కెమెరా వైపు లుక్కేస్తే.. ఆపరేటర్ క్లారిటీగా ఫొటో తీస్తారు. మీరు ఫొటోను చెక్ చేసుకున్న తరువాతే అప్లోడ్ చేయించండి. నచ్చకపోతే మరోసారి క్లారిటీగా ఫొటో దిగండి.
ఆధార్‌లో ఫొటోను ఎలా మార్చుకోవాలి..?
==> ఆధార్ కార్డ్‌లో మీ ఫొటోను మార్చుకోవాలనుకుంటే.. మీ సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రానికి వెళ్లండి
==> మీరు https://appointments.uidai.gov.in వెబ్సైట్ ద్వారా మీకు దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని చెక్ చేసుకోవచ్చు.
==> ఆధార్ కేంద్రంలో మీకు ఇచ్చిన ఫారమ్‌లో.. అన్ని వివరాలను నింపండి.
==> మీ అభ్యర్థన మేరకు సెంటర్ ఆపరేటర్ బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తారు.
==> ఆ తరువాత మీ ఫొటోను తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు.
==> రిఫరెన్స్ కోసం అప్డేట్ రిక్వెస్ట్ నంబర్‌ను ఉన్న స్లిప్ ప్రింట్ అవుట్ మీకు ఇస్తారు.
==> అప్డేట్ అయిత తరువాత మీరు UIDAI అధికారిక వెబ్సైట్ uidai.gov.in నుంచి ఆధార్ కార్డ్ డిజిటల్ కాపీని (e-Aadhaar) డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీరు ఫొటో కాకుండా ఇతర వివరాలు అప్డేట్ చేసుకోవాలనుకుంటే.. ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే కూర్చొని సింపుల్‌గా మార్చుకోవచ్చు. అందుకోసం ఈ కింద స్టెప్స్ ఫాలో అయిపోండి..
==> ముందుగా మీరు ఆధార్ Uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి
==> మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి.. ఓటీపీతో లాగిన్ చేయండి
==> డిస్ ప్లేపై ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి
==> ఇప్పుడు మీ ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి
==> ఆ తరువాత మీరు ఆన్లైన్ ఆధార్ సేవకు వెళ్లాలి.
==> లిస్టులో పేరు, చిరునామా, లింగం, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ జాబితా కనిపిస్తుంది.
==> మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ఏ సమాచారాన్ని అయినా ఎంచుకోవచ్చు.
==> What do you want to Update ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> కొత్త పేజీలో మీరు క్యాప్చా ఎంటర్ చేసి.. ఓటీపీ వెరీ ఫై చేయాలి.
==> సేవ్ చేసి ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీ ఆధార్ కార్డు అప్డేట్ అవుతుంది.
==> అప్డేట్ అయిన తరువాత ఆన్లైన్ డిజిటల్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Also Read: CM KCR Speech: నేను కథలు చెప్పటం లేదు.. కళ్ల ముందు జరుగుతున్న చేదు నిజాలు: సీఎం కేసీఆర్
Also Read: Indian Railways: రైల్వే కోచ్‌లపై ఈ నంబరుకు అర్థం తెలుసా..! ఇక ఈజీగా చెప్పేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి