HIV Patients Village: ఆ గ్రామంలో ఉన్న పిల్లలు పెద్ద వారు అంతా కూడా హెచ్ఐవీ బాధితులు. బయటి ప్రపంచంలో అత్యంత హీనంగా చూడబడుతు కన్నీళ్లు పెట్టుకుంటున్న వారు హెచ్ఐవీ బాధితులు ఆ గ్రామంలో మాత్రం చాలా సంతోషంగా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు.
ఆ గ్రామం ను ఒకప్పుడు లేకుండా చేయాలని భావించి వారు కూడా ఇప్పుడు ఆ గ్రామాన్ని ప్రత్యేకమైన గ్రామంగా గుర్తించడం తో పాటు ఆ గ్రామం గురించి తెలుసుకునేందుకు రోజుకు పదుల కొద్ది మంది జనాలు వెళ్తున్నారు. హెచ్ఐవీ బాధిత ఒక చిన్నారి మృతి తో రవికాంత్ అనే వ్యక్తిలో వచ్చిన అనూహ్య మార్పు మరియు అతడి యొక్క ఆలోచన విధానం నుండి పుట్టినదే ఆ గ్రామం.
ప్రస్తుతం దేశంలోనే ప్రత్యేకమైన గ్రామంగా 'హ్యాపీ ఇండియన్ విలేజ్' ను ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్ఐవీ బాధితుల కోసం రవికాంత్ ఒక గ్రామాన్నే ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కథే ఉంది. ఆ వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని ధోండి హిప్పరగకు చెందిన రైతు కుటుంబంలో జన్మించిన రవికాంత్ ఆర్మీ లో జాయిన్ అవ్వాలని ఆశ పడ్డాడు.
కానీ హైట్ తక్కువ ఉండటంతో ఆర్మీ జాబ్ లో రిజక్ట్ అయ్యాడు. దాంతో జర్నలిస్ట్ గా మారాడు. విధి నిర్వహణలో భాగంగా ఒక రోజు రవికాంత్ ఒక గ్రామానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఒక అనాథ చిన్నారి మృతదేహం పడి ఉంది.
కాకులు పొడుచుకు తింటున్న ఆ చిన్న పిల్లాడు హెచ్ఐవి బాధితుడు అని.. అందుకే గ్రామస్తులు అతడి అంత్యక్రియలకు ముందుకు రాలేదని తెలుసుకున్న రవికాంత్ అన్నీ తానై దగ్గర ఉండి ఆ పిల్లాడికి అంత్యక్రియలు జరిపించడం జరిగింది. అంత్యక్రియలు జరిపించిన తర్వాత రవికాంత్ లో ఒకటే ఆలోచన మొదలు అయ్యింది.
Also Read: RCB vs GT: బెంగళూరులో భారీ వర్షం.. టాస్ ఆలస్యం! ఆర్సీబీ ఆశలపై నీళ్లు
ఇలాంటి ఎంతో మంది సమాజంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కదా.. వారికి సహాయం ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా స్నేహితుడి సహాయం తీసుకుని తన గ్రామానికి దూరంగా ఒక చిన్న గ్రామంలో పది ఎకరాల భూమిలో సేవాలయం ఏర్పాటు చేశాడు.
హెచ్ఐవీ బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న భవనం అంటూ కొందరు గ్రామస్తులు ఆ సేవాలయానికి కరెంటు ఇచ్చేందుకు నిరాకరించారు. అంతే కాకుండా నీటిని కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి అక్కడ నుండి పంపించాలని చూశారు. కానీ రవికాంత్ పట్టు వదల్లేదు. కలెక్టర్ వద్దకు వెళ్లి తాను అనుకున్నది సాధించాడు.
ఒక్క హెచ్ఐవీ బాధిత చిన్నారితో మొదలు అయిన రవికాంత్ సేవాలయం వందల మందికి ఆశ్రయాన్ని ఇచ్చింది. చిన్న పిల్లలు గా వచ్చిన హెచ్ ఐ వీ బాధితులకు చదువు చెప్పించి పెద్దవారిని చేసి వారికి పెళ్లి కూడా చేసి రవికాంత్ ఒక గ్రామాన్నే ఏర్పాటు చేశాడు. ఒకప్పడు అతడిని అసహ్యించుకునే వారు ఇప్పుడు దేవుడు అంటూ ప్రశంసిస్తూ ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook