7th Pay Commission Latest Update: ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి డీఏ పెంపు ప్రకటన రాగా.. త్వరలో రెండో డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం రానుంది. కేంద్ర ప్రభుత్వ డీఏ పెంపుతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు శుభవార్తలు అందించాయి. డీఏ పెంపును గిఫ్ట్‌గా అందించాయింది. అయితే గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపును తిరస్కరించారు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఉద్యోగులు నిరసన చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల ఉమ్మడి వేదిక సీఎం మమతా బెనర్జీ నివాసం దగ్గర భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి ఉద్యోగులు భారీగా తరలిరావడం విశేషం.
ఈ సందర్భంగా కోల్‌కతా వీధుల్లో ఉద్యోగులు ప్రదర్శన చేశారు. హైకోర్టు అనుమతితో ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యోగులు బ్యానర్లు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని.. డీఏను పెంచాలని వారు డిమాండ్ చేశారు. చాలారోజులుగా డీఏ పెంపు కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య బడ్జెట్‌ను సమర్పిస్తూ.. డీఏను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే తమకు కేంద్ర ప్రభుత్వ తరహాలో 42 శాతం డీఏ అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. కేంద్ర ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డీఏ చాలా తక్కువని అంటున్నారు. ఉద్యోగుల ఆందోళనలకు ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి.
ఈ విషయంపై సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. కేంద్ర ఉద్యోగుల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనానికి భిన్నంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ సందర్భాల్లో సెలవులు వస్తాయని తెలిపారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇప్పటికీ పెన్షన్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
Also Read: Virat Kohli Records: విరాట్ కోహ్లీ మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా..
Also Read: Virat Kohli Sourav Ganguly Controversy: చేతులు కలిపిన గంగూలీ, విరాట్.. వివాదానికి ముగింపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook