Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్స్.. ఈ ఏడాది ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే..

Encounters in Jammu Kashmir in 2021: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్ల వివరాలను ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఎన్‌కౌంటర్లలో మొత్తం ఎంత మంది చనిపోయారు... అందులో ఉగ్రవాదులు ఎంతమంది, సాధారణ పౌరులు ఎంతమంది అనే వివరాలు వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 01:44 PM IST
  • జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది 88 ఎన్‌కౌంటర్స్
  • ఈ ఏడాది ఎన్‌కౌంటర్స్‌లో 171 మంది ఉగ్రవాదుల హతం
  • ఎన్‌కౌంటర్లలో 34 మంది సాధారణ పౌరులు మృతి
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్స్.. ఈ ఏడాది ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే..

Encounters in Jammu Kashmir in 2021: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది జరిగిన 88 ఎన్‌కౌంటర్లలో మొత్తం 171 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. వీరిలో 19 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు కాగా... 152 మంది స్థానికులని పేర్కొన్నారు. మరో 34 మంది సాధారణ పౌరులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందినట్లు చెప్పారు. గతేడాది 37 మంది సాధారణ పౌరులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందగా ఈ ఏడాది ఆ సంఖ్య స్వల్పంగా తగ్గింది.

శ్రీనగర్‌లో (Srinagar) గురువారం అర్ధరాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా నలుగురు భద్రతా సిబ్బందిగాయపడ్డారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్‌కు చెందిన సుహైల్ అహ్మద్‌గా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

శ్రీనగర్‌ శివారులోని పాంథా చౌక్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ (Encounter in Jammu Kashmir) చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై కాల్పులను తిప్పికొట్టారు. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా.. నలుగురు జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అంతకుముందు రోజు అనంత్ నాగ్, కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. 

Also Read: New Year Cake 2022: న్యూఇయర్ కోసం ఇంట్లోనే మ్యాంగో చీజ్ కేక్ తయారీ ఎలానో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News