Ridge Gourd 12 Benefits: బీరకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండకాలం ఈ కూరగాయను మీ డైట్లో చేర్చుకుంటే మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. బీరకాయను మీ డైట్లో చేర్చుకుంటే ఈ 12 ఆరోగ్య ప్రయోజనాలు పొందినట్లే..
హైడ్రేటింగ్..
బీరకాయలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది మనకు రోజంతా హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. బీరకాయలో కూలింగ్ గుణాలు ఉంటాయి. ఇది మన శరీరాన్ని చల్లగా ఉంచి రిఫ్రెష్మింట్ ఇస్తుంది.
బరువు నిర్వహణ..
బీరకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు.
పోషకాల గని..
బీరకాయలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సీ,ఏ , పొటాషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి.
షుగర్ లెవల్స్..
బీరకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి. ఇవి డయాబెటిస్ రాకుండా నివారిస్తాయి.
ఇమ్యూనిటీ..
బీరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. మీ డైట్లో బీరకాయను చేర్చుకుంటే ఇమ్యూనిటీ బలపడుతుంది.
కంటి ఆరోగ్యం..
బీరకాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. కంటి వాపు, మంట సమస్యలను కూడా బీరకాయ సమర్థవంతంగా తగ్గిస్తుంది.
జీర్ణ ఆరోగ్యం..
బీరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది. మలబద్ధకం, అజీర్తి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.
యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు..
బీరకాయలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వాపు సమస్యలను తగ్గిస్తాయి.
ఇదీ చదవండి: ఈ 5 ఆరోగ్యకరమైన గింజలు స్ట్రోక్ రాకుండా హార్ట్ బ్లాకేజీలను నివారిస్తాయి..
ఎనర్జీ..
బీరకాయలో మన శరీరానికి కావాల్సినంత పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి తగినంత శక్తిని కూడా ఇస్తాయి. మండే ఎండలకు నీరసాన్ని తగ్గిస్తుంది.
జుట్టు ఆరోగ్యం..
బీరకాయను డైట్లో చేర్చుకుంటే హెయిర్ ఫాల్ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. ఇది జుట్టు డ్యామేజ్ అవ్వకుండా ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది.
దృఢమైన ఎముకలు..
బీరకాయలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి. అంతేకాదు బీరకాయలో మెగ్నీషియం ఉంటుంది. కండరాల పనితీరుకు ఇవి ఎంతో అవసరం.
ఇదీ చదవండి: లవంగం టీ తాగుతున్నారా? మైండ్ బ్లాంక్ అయ్యే మిరకిల్స్..!
చర్మ ఆరోగ్యం..
బీరకాయలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. యాక్నే, సన్ ట్యాన్ తొలగించి వృద్ధాప్యా ఛాయలు త్వరగా రాకుండా నివారిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook