Red Grapes Benefits: పిల్లల నుంచి పెద్దవారి దాకా ద్రాక్ష పండ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని దేశాల్లో ద్రాక్ష పండ్లతో వైన్ కూడా తయారు చేస్తారు. మార్కెట్లో తరచుగా గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ లో ఉండే ద్రాక్షలను మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎరుపు రంగులో కూడా ద్రాక్ష అందుబాటులో ఉంది. ఈ ఎరుపు రంగుతో కూడిన ద్రాక్ష పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
ఎరుపు రంగు ద్రాక్ష పండ్లలో విటమిన్-సి, విటమిన్-ఎ, జింక్, కాపర్, పొటాషియం, కాల్షియం మొదలైన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఈ పండ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఎరుపు రంగు కలిగిన ద్రాక్షను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మాంగనీస్ యొక్క గొప్ప మూలం
ఈ ద్రాక్ష రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ ద్రాక్ష మాంగనీస్ యొక్క గొప్ప మూలం. ఇది ఎముకల అభివృద్ధి మరియు జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఎర్ర ద్రాక్ష పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గుతుంది.
యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి:
ఎర్ర ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఈ పండ్లను తినడం వల్ల అన్ని వ్యాధుల నుంచి శరీరాన్ని సులభంగా రక్షిస్తాయి. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు సులభంగా దూరమవుతాయి. దీంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి:
ద్రాక్షలో ఉండే పొటాషియం, ఫైబర్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ఈ ఎరుపు రంగు ద్రాక్షను ప్రతిరోజు తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది అంతే కాకుండా ఇందులో ఫైబర్ పరిమాణాలు కూడా అధికంగా లభిస్తాయి. కాబట్టి శరీర బరువు కూడా సులభంగా తగ్గుతారు. ముఖ్యంగా మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ ద్రాక్ష రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది:
చెడు కొలెస్ట్రాల్ కారణంగా చాలామంది గుండెపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఎరుపు రంగుతో కూడిన ద్రాక్షను ఉదయం పూట తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుండెపోటు సమస్యలు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఈ ఎరుపు రంగు ద్రాక్షను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.