Mushroom Farming Business Idea: నేటికాలంలో చాలా మంది చిన్న వయసులో బిజినెస్ ప్రారంభిస్తున్నారు. ఈ బిజినెస్‌లతో ఇంటికి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా తమ కోసం కూడా ఖర్చు చేసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. ప్రస్తుతం చిన్న వ్యాపారాలకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఈ వ్యాపారాలను మీ ఇంటి నుంచే ప్రారంభించి మీ సొంత షెడ్యూల్ ప్రకారం నడపవచ్చు. అయితే ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ కేవలం యువతకు మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే మహిళలకు కూడా మంచి అవకాశం. ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలి? అనే వివరాలు తెలుసుకుందాం.
ఇంట్లో ఉండే మహిళలు ఇప్పుడు తమ సృజనాత్మకతను, నైపుణ్యాలను ఉపయోగించుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేయడం చాలా సాధారణంగా మారింది. ఇది వారికి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇవ్వడమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
చిన్న బిజినెస్‌లను చేయడం వల్ల ఇంటి ఖర్చులకు తోడ్పడటంతో పాటు, వ్యక్తిగత అవసరాలకు డబ్బును వెచ్చించుకునే అవకాశం లభిస్తుంది. సృజనాత్మకతను ఉపయోగించుకుని కొత్త ఉత్పత్తులు లేదా సేవలను అందించే అవకాశం ఉంటుంది.
ఇంటి పనులతో పాటు వ్యాపారాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించడం వల్ల సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతర మహిళలతో కలిసి పని చేయడం వల్ల కొత్త స్నేహితులు చేసుకోవచ్చు.
ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ ఇంట్లో పుట్టగొడుగులను పెంపకం. ఈ వ్యాపారం ప్రారంభించడానికి అధిక పెట్టుబడి అవసరం లేదు అతి తక్కువ పెట్టుబడితో కూడా స్టార్ట్ చేయవచ్చు.
పుట్టగొడుగుల వ్యాపారం ప్రస్తుతం భారతదేశంలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన వ్యాపారాలలో ఒకటి. ఇది కేవలం ఆహార పదార్థం మాత్రమే కాదు, ఇందులో అధిక పోషక విలువలు ఉన్నాయి.
పుట్టగొడుగు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు మొదలైన పోషకాలకు మంచి మూలం. ఆరోగ్య అవగాహన పెరుగుతున్న కాలంలో పుట్టగొడుగులకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. పుట్టగొడుగుల వ్యాపారాన్ని చిన్న స్థలంలో, తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు.
పుట్టగొడుగులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటం వల్ల అధిక లాభాలు పొందవచ్చు. పుట్టగొడుగు త్వరగా పెరుగుతాయి కాబట్టి తక్కువ సమయంలోనే లాభాలు పొందవచ్చు.
ఇంట్లో పుట్టగొడుగు పెంచడానికి చిన్న గది లేదా బాల్కనీ సరిపోతుంది. పుట్టగొడుగులు బాగా పెంచడానికి మంచి కంపోస్ట్ ఉపయోగించాలి. ఎప్పుడు ఒకే రకమైన పుట్టగొడుగులు కాకుండా వివిధ రకాల పుట్టగొడుగులకు వివిధ రకాల స్పాన్‌లు అందుబాటులో ఉంటాయి వాటికి ఉపయోగించండి.
పుట్టగొడుగులను పెంచడానికి ప్లాస్టిక్ సంచులు లేదా పెట్టెలు ఉపయోగించవచ్చు. పుట్టగొడుగులకు తగినంత నీరు అందించాలి. పుట్టగొడుగులు పెరిగేందుకు తగిన ఉష్ణోగ్రత అవసరం. దీంతో పాటు తగిన తేమ స్థాయిని నిర్వహించాలి.
మీరు పెంచిన పుట్టగొడుగులను స్థానిక మార్కెట్లలో మీ ఉత్పత్తులను అమ్మవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లకు మీ ఉత్పత్తులను అమ్మవచ్చు. లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మీ ఉత్పత్తులను అమ్మవచ్చు.
పుట్టగొడుగుల బిజినెస్‌తో మీరు నెలకు రూ. లక్ష వస్తుంది. అంటే సంవత్సరానికి రూ. 12లక్షలు సంపాదించుకోవచ్చు.