Omicron Symptoms: ఒమిక్రాన్ సోకిన వారిలో ఆ 14 లక్షణాలు.. డెల్టాతో పోలిస్తే తీవ్రత తక్కువే!

Omicron Symptoms: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ బారిన పడిన వారిలో లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. అయితే డెల్టా కంటే ఒమిక్రాన్ తీవ్రత తగ్గిందని ఓ సర్వే తెలిపింది. ఒమిక్రాన్ సోకిన వారిలో 14 లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 09:45 AM IST
    • ఒమిక్రాన్ సోకిన వారిలో 14 లక్షణాలు
    • డెల్టా వేరియంట్ తో పోలిస్తే తక్కువ తీవ్రత
    • ప్రాణాపాయం ఉండకపోవచ్చని అంచనా
Omicron Symptoms: ఒమిక్రాన్ సోకిన వారిలో ఆ 14 లక్షణాలు.. డెల్టాతో పోలిస్తే తీవ్రత తక్కువే!

Omicron Symptoms: దాదాపుగా రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దానికి తోడుగా ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలకు గురిచేస్తుంది. సౌతాఫ్రికాలో ప్రారంభమైన ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. దాని ధాటికి కరోనా కేసులు కూడా నానాటికి పెరిగి పోతున్నాయి. కరోనా వైరస్ తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ కు లక్షణాలు కూడా మారుతున్నాయి.

కరోనా బారిన పడిన వ్యక్తులు గతంలో దగ్గు, జ్వరం, అలసటతో పాటు ఒమిక్రాన్ వైరస్ బారిన పడిన వాళ్లలో అతిసారం (డయేరియా) లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ కాస్త వేగంగా వ్యాపిస్తుందని ప్రాథమిక అంచనాలో తేలింది. దీని వల్ల కరోనా లక్షణాలతో పాటు ఊపిరితిత్తులకు తక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 

డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉన్నాయి?

కరోనా వైరస్ కు చెందిన డెల్టా వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. దీని వల్ల రోగులు ఆస్పత్రి పాలవడం సహా మృతి చెందే అవకాశాలూ ఉన్నాయి. కరోనా రెండో వేవ్ సమయంలో చాలా మంది ప్రజలు దగ్గు, జ్వరం, వాసన కోల్పోవడం, నాలుక రుచి కోల్పోవడం వంటి తేలికపాటి లక్షణాలతో పాటు శ్వాస తీసుకోలేక పోవడం.. ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన లక్షణాలతో బాధపడ్డారు. వైరస్ బారిన పడిన కొందరు మరణించారు. 

కానీ, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఊపిరితిత్తులపై తక్కువ ప్రభావం చూపుతుంది. ఒమిక్రాన్ సోకిన వారిలో సాధారణ జలుబు లేదా జ్వరాన్ని పోలి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. 

ఒమిక్రాన్ సోకిన వారిలో 14 లక్షణాలు..

ఒమిక్రాన్ బారిన పడిన రోగుల్లో ప్రధానంగా 14 లక్షణాలు కనిపిస్తున్నాయి. వాటి వాటి తీవ్రతను బట్టి వర్గీకరించడం జరిగింది. ఆయా లక్షణాలు ఎంత శాతం మందిలో ఉన్నాయని ఓ సర్వే తెలిపింది. 

నాసికా రంధ్రాలు మూతపడడం - 73%

తలనొప్పి - 68%

అలసట - 64%

తుమ్ములు - 60%

గొంతు నొప్పి - 60%

నిరంతర దగ్గు - 44%

బొంగురు గొంతు - 36%

చలి లేదా వణుకు - 30%

జ్వరం - 29%

మత్తుగా ఉండడం - 28%

మెదడు మొద్దుబారిన లక్షణం - 24%

కండరాల నొప్పులు - 23%

వాసన తెలియకపోవడం - 19%

ఛాతీ నొప్పి - 19%. 

Also Read: Easy weight loss tips: బరువు తగ్గడానికి జిమ్ములో గంటల తరబడి కసరత్తులు చేయాల్సిన పని లేదట

Also Read: Corona Symptoms in Kids: కరోనా సోకిన పిల్లల్లో రెండు కొత్త లక్షణాలు- ముందే జాగ్రత్త పడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News