Peppermint Tea: పెప్పర్‌మింట్ టీ కి ఇన్ని ఉపయోగాలా.. తెలిస్తే రోజూ తాగుతారు!

Peppermint Tea Uses: పెప్పర్‌మింట్ టీ లో క్యాఫైన్ ఉండదు. జీర్ణశక్తిని మెరుగుపరచడం నుంచి మైగ్రేన్ ఉపశమనం వరకు.. పెప్పర్‌మింట్ టీకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెప్పర్‌మింట్ టీ వల్ల చాలానే ఉపయోగకు ఉన్నాయి. అవేంటో తెలిస్తే రోజూ తాగడానికి ఆసక్తి చూపిస్తారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 29, 2024, 08:50 PM IST
Peppermint Tea: పెప్పర్‌మింట్ టీ కి ఇన్ని ఉపయోగాలా.. తెలిస్తే రోజూ తాగుతారు!

Peppermint Tea Benefits: పెప్పర్‌మింట్ టీ చాలా రుచిగా ఉంటుంది. కానీ దాని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోజు పెప్పర్‌మింట్ టీ తాగేవారిలో.. రోగ నిరోధక శక్తి కూడా పెరిగింది అని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే ఈ పెప్పర్‌మింట్ టీ వల్ల ఉన్న బోలెడు ఆరోగ్య ప్రయోజనాలలో కొన్ని ఇప్పుడు చూద్దాం..

జీర్ణ సమస్యలను తగ్గించవచ్చు:

పెప్పర్‌మింట్ గ్యాస్, బ్లోటింగ్, అజీర్ణత వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. పెప్పర్‌మింట్ ఆయిల్ జీర్ణ వ్యవస్థలోని కండరాలను నిద్రావస్థలోకి తీసుకెళ్లి, వివిధ జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ఈ విధంగా, పెప్పర్‌మింట్ టీ వల్ల జీర్ణ వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. 

నొప్పుల నుండి ఉపశమనం:

పెప్పర్‌మింట్ ఆయిల్‌లోని మెంటాల్ రక్త ప్రవాహాన్ని పెంచి, చల్లని అనుభూతిని కలిగిస్తుంది. దాని వల్ల నొప్పి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు.. ఈ పెప్పర్‌మింట్ టీ చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. 

శ్వాసను తాజాగా చేస్తుంది:

పెప్పర్‌మింట్ టూత్‌పేస్ట్స్, మౌత్‌వాష్‌లు, చ్యూయింగ్ గమ్స్‌లు రుచిగా కూడా ఉంటాయి. అలాగే అవి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండి, దంతాలకు ఉన్న బ్యాక్టీరియాను తగ్గించి దుర్వాసనను తగ్గిస్తుంది.

సైనస్‌ల నుండి తక్షణ ఉపశమనం:

పెప్పర్‌మింట్‌లో బ్యాక్టీరియల్, వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా, పెప్పర్‌మింట్ టీ సైనస్‌ ఇబ్బందుల నుండి ఉపశమనం త్వరగా కలిగిస్తుంది.

బలంగా అనిపించడం:

పెప్పర్‌మింట్ టీ మన ఒంట్లోని శక్తి స్థాయిని పెంచి, అలసటను తగ్గిస్తుంది. పెప్పర్‌మింట్ ఆయిల్ మానసిక.. అలాగే శారీరక అలసటను కూడా తగ్గించగలదు.

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లను తగ్గించవచ్చు:

పెప్పర్‌మింట్ టీ మన శారీరంలో ఉండే వివిధ బ్యాక్టీరియా రకాలను చంపగలదు. ఇది ఆహారం ద్వారా వచ్చే రోగాలు, అంటువ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది.

నిద్రను మెరుగుపరుస్తుంది:

పెప్పర్‌మింట్ టీ క్యాఫైన్ లేకుండా ఉంటుంది. అందుకే నిద్ర ముందు తాగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా నిద్ర కూడా పడుతుంది.

బరువు తగ్గవచ్చు:

పెప్పర్‌మింట్ టీ సహజంగా తక్కువ కాలరీలతో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గించే ప్రయాణంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.

సీజనల్ అలర్జీలు తగ్గుతాయి:

పెప్పర్‌మింట్‌లో రోస్మారినిక్ అనే ఒక ఆమ్లం ఉంటుంది, ఇది అలర్జీ లక్షణాలను తగ్గిస్తుంది.

పెప్పర్‌మింట్ టీ రుచికరమైన పానీయం. దీన్ని మన రోజువారీ డైట్‌లో సులభంగా చేర్చవచ్చు. పెప్పర్‌మింట్ టీ బ్యాగ్‌లు, లూజ్-లీఫ్ టీ, ఎలా తీసుకున్నా కూడా ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మెండుగానే ఉంటాయి.

Read more: Shravana mass 2024: ఆగస్టు నెలలో శ్రావణంతో సహా రాఖీ, వరలక్ష్మీ వ్రతం, శ్రీకృష్ణాష్టమి పండుగల తేదీలివే..  

Read more: Tirumala: తిరుమలలో శ్రావణ మాస ఉత్సవాలు.. ఆగస్టు నెలలో జరిగి విశేష వేడుకల డిటెయిల్స్ ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News