Monsoon Health Tips: వాన కాలం తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి.. లేక పోతే ఈ వ్యాధులు తప్పవు..!

Monsoon Health Tips: రుతుపవనాల్లో మార్పులు వస్తున్నాయి. వాన కాలం రానే వచ్చింది. ఈ వర్షకాలంతో పాటు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి.  ఈ కాలం ఆహ్లాదకరంగా అనిపించినా..సీజన్‌లో ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2022, 03:09 PM IST
  • వాన కాలం తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి..
  • లేక పోతే ఈ వ్యాధులు తప్పవు
  • స్ట్రీట్‌ ఫుడ్‌కు గుడ్‌బాయ్‌ చెప్పండి
Monsoon Health Tips: వాన కాలం తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి.. లేక పోతే ఈ వ్యాధులు తప్పవు..!

Monsoon Health Tips: రుతుపవనాల్లో మార్పులు వస్తున్నాయి. వాన కాలం రానే వచ్చింది. ఈ వర్షకాలంతో పాటు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి.  ఈ కాలం ఆహ్లాదకరంగా అనిపించినా..సీజన్‌లో ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దోమల వల్ల వచ్చే వ్యాధులైన మలేరియా, డెంగ్యూ కేసులు కూడా వర్షాల కారణంగా వేగంగా పెరుగుతాయి. అంతేకాకుండా బయట దోరికే ఫుడ్‌ను తిన్న ఇన్ఫెక్షన్లు తప్పవు. కావున వర్షకాలంలో ఈ విషయాలలో జాగ్రత్త పాటించాలి. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్ట్రీట్‌ ఫుడ్‌కు గుడ్‌బాయ్‌ చెప్పండి:

 వర్షం కాలంలో స్ట్రీట్‌ ఫుడ్‌కు  దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేయించిన, కాల్చిన ఆహారాన్ని తినడం వల్ల కడుపు సమస్యలు వస్తాయని వారు చెబుతున్నారు. ఒక వేళా  వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ తింటే ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు వంటి వ్యాధులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2. పచ్చి ఆహారం తినడం మంచిది కాదు:

వానా కాలంలో ఎలాంటి పచ్చి ఆహారమైనా అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈ సీజన్‌లో శరీరంలో మెటబాలిజం చాలా స్లో అవుతుంది. దీని వల్ల ఆహారం ఆలస్యంగా జీర్ణమవుతుంది. కావున ఎలాంటి పచ్చి ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

3. తినడానికి ముందు చేతులు కడుక్కోండి:

 

ఆహారం తినే ముందు వాన కాలంలో ఎప్పుడూ సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఈ కాలంలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా చేతులకు అంటుకుంటుంది. కావున ఇది వ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు.
 

4. కాచిన నీరు త్రాగండి:

వర్షంలో ఇన్ఫెక్షన్స్‌ అన్నీ నీటి వల్ల వస్తాయి. ఈ సీజన్‌లో నీటిని మరిగించి తాగాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల అన్ని రకాల బ్యాక్టీరియా  నాశనం అవుతుంది.

5. రోగనిరోధక శక్తిని బలోపేతం:

వర్షం కాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి. దీని వల్ల మీరు అనారోగ్యానికి గురైనపుడు.. సమస్యల నుంచి త్వరగా విముక్తి పొందవచ్చు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి డ్రై ఫ్రూట్స్, మొక్కజొన్న, బార్లీ, గోధుమలు, శెనగపిండి వంటి ధాన్యాలను ఆహారంలో వినియోగించుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: Heart Attack: చాలా మందికి ఈ శస్త్రచికిత్సల వల్లే గుండె పోటు సమస్యలు వస్తున్నాయి..!

Also Read: Skin Care: చర్మ సౌదర్యం తగ్గిపోతుందా..ఈ చిట్కాలను పాటించండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News