Platelet Count: డెంగ్యూ రోగులకు ఈ 5 పండ్లు దివ్య ఔషధంతో సమానం, ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే అద్భుత మార్గం

Platelet Count: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఇమ్యూనిటీ తగ్గడంతో సీజనల్ వ్యాధులు దాడి చేస్తుంటాయి. వివిధ రకాల వ్యాధుల కారణంగా ప్లేట్‌లెట్ కౌంట్స్ తగ్గే ముప్పు పొంచి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 13, 2024, 07:16 AM IST
Platelet Count: డెంగ్యూ రోగులకు ఈ 5 పండ్లు దివ్య ఔషధంతో సమానం, ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే అద్భుత మార్గం

Platelet Count: వర్షాకాలంలో దోమల బెడద కారణంగా డంగ్యూ, మలేరియాతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రబలుతుంటాయి. శరీరంలో ఉండే ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోతుంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకమయ్యే పరిస్థితి ఉంటుంది. అందుకే వర్షాకాలంలో హెల్తీ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. 

ప్రతి యేటా వర్షాకాలంలో సాధారణంగా కన్పించే సమస్య డెంగ్యూ. ఇదొక సీరియస్ వ్యాధి. ఈ వ్యాధి సోకినరోగికి రక్తంలోని ప్లేట్‌లెట్ కౌంట్ గణనీయంగా తగ్గిపోతుంటుంది. బ్లడ్ క్లాటింగ్‌లో ప్లేట్‌లెట్ దోహదపడతాయి. ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గితే బ్లీడింగ్, ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అయితే ప్రకృతిలో లభించే కొన్ని పండ్లు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ప్లేట్‌లెట్ సంఖ్యను పెంచవచ్చు. ప్లేట్‌లెట్ కౌంట్ పెంచేందుకు వివిధ రకాల మందులు అందుబాటులో ఉన్నా సహజసిద్ధంగా పెంచుకోవడం అత్యుత్తమ మార్గం. డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్‌లెట్ కౌంట్ పెంచుకునేందుకు ఏయే పండ్లు తీసుకోవాలో తెలుసుకుందాం.

జామ

ప్రకృతిలో అత్యంత విరివిగా లభిస్తుంది. ధర కూడా చాలా తక్కువ కావడంతో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. ఇందులో ఉండే ఐరన్ రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణంలో ఉపయోగపడుతుంది. డెంగ్యూ సోకినప్పుడు రోజుకు 1-2 జాంకాయలు తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేస్తే ప్లేట్‌లెట్ కౌంట్ భారీగా పెరుగుతుంది. అంతేకాకుండా డెంగ్యూ రోగులు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు అత్యధికంగా తాగాలి. 

బొప్పాయి

ప్లేట్‌లెట్ కౌంట్ పెంచేందుకు అనాదిగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ మార్గం. బొప్పాయి పండుతో పాటు బొప్పాయి లేత ఆకుల రసం ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పపీతైన్ అనే ఎంజైమ్ రక్త కణాల నిర్మాణానికి దోహదం చేస్తుంది. డెంగ్యూ రోగులు రోజుకు కనీసం 100-200 గ్రాముల బొప్పాయి ముక్కలు తినాలి. లేదా రోజూ పరగడుపున బొప్పా.యి లేత ఆకుల రసం 1-2 చెంచాలు తాగాలి

పుచ్చకాయ

పుచ్చకాయలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు సాధారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోతుంది. అయితే పుచ్చకాయ తినడం వల్ల అటు డీ హైడ్రేషన్ సమస్య తొలగిపోవడమే కాకుండా ప్లేట్‌లెట్ సంఖ్య కూడా పెరుగుతుంది. 

దానిమ్మ

దానిమ్మ అనగానే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి గుర్తొస్తాయి. ఈ రెండూ ఇందులో పుష్కలంగా దొరుతుతాయి. ఇవి శరీరం ఇమ్యూనిటీని గణనీయంగా పెంచడం, ప్లేట్‌లెట్ సంఖ్య పెంచడం చేస్తాయి. రోజూ ఒక దానిమ్మ పండు లేదా ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం మంచిది. 

అరటి పండు

అరటిలో పొటాషియం పెద్దఎత్తున లభిస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసేందుకు దోహదం చేస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు సాధారణంగా వాంతులు, విరేచనాల సమస్య కారణంగా శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి. దాంతో ప్లేట్‌లెట్స్ తగ్గి మనిషి పూర్తిగా బలహీనపడిపోతాడు. ఈ క్రమంలో రోజూ 1-2 అరటి పండ్లు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Also read: Milk Benefits: కూల్ మిల్క్ వర్సెస్ హాట్ మిల్క్, రాత్రి వేళ ఏది మంచిదో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News