Lungs Problems: ఊపిరితిత్తులు ముసలివైపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇవే..

Lung Problems Symptoms: ఊపిరితిత్తులు శరీరంలో ముఖ్యమైన అవయవం. కొన్ని ఆహారపదార్ధాలు, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం వల్ల ఊపిరితిత్త సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 1, 2024, 11:57 AM IST
 Lungs Problems: ఊపిరితిత్తులు ముసలివైపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇవే..

Lung Problems Symptoms: ఊపిరితిత్తులు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది శరీరానికి కావాల్సిన ఆక్సిజన్‌ ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంచిస్తుంది. ఇది శ్వాస ప్రక్రియకు ఎంతో సహాయపడుతుంది. మన జీవించడానికి ఊపిరితిత్తులే కారణం. అయితే ఆరోగ్యనిపుణుల ప్రకారం శరీర అవయవాలు త్వరగా వృద్ధాప్యం బారిన పడుతాయని చెబుతున్నారు. వీటి పనితీరు మందగిస్తుంటుంది. అయితే మన వయస్సు పెరిగే కొంది ఊపిరితిత్తుల వయసు తగ్గుతుందని చెప్పే లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి..?  

వయసు పెరగడంతో మన శరీరంలోని అన్ని అవయవాలలాగే ఊపిరితిత్తులు కూడా మార్పులకు లోనవుతాయి. ఈ మార్పులు కొంతమందిలో తీవ్రంగా ఉండగా, మరికొందరిలో చాలా తక్కువగా ఉండవచ్చు. ఈ మార్పుల కారణంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అందులో చిన్న పని చేసిన వెంటనే ఊపిరి ఆడకపోవడం, ఛాతిలో నొప్పి, బిగుతుగా ఉండటం కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే తీవ్రమైన దగ్గు ావడం కూడా ఊపిరితిత్తుల సమస్యకు లక్షణం. లోతుగా ఊపిరి పీల్చినప్పుడు లేదా దగ్గినప్పుడు నొప్పి కలగడం వంటి సమస్యలు కూడా దీని సంకేతం. ఉదయం ఎక్కువగా శ్లేష్మం పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. వారు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అవసరమైన పరీక్షలు చేసి, సరైన చికిత్సను సూచిస్తారు.

ఊపిరితిత్తులను రక్షించుకోవడం ఎలా?

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఆరోగ్యంగా ఉంచడం వల్ల శరీరానికి ఆక్సిజన్‌ సక్రమంగా అందుతుంది. అయితే ఎలాంటి మార్పులు చేసుకోవాల్సి  అనేది మనం తెలుసుకుందాం. 

ముందుగా ధూమపానం, మద్య పానం వంటి వాటికి దూరంగా ఉండాలి. దీని వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. అలాగే ఎక్కువ పొగ, విషవాయువులు ఉన్న ప్రాంతాల్లో ఉండటం తగ్గించండి. దీని వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం వ్యాయామనం చేయడం, జాగింగ్‌ , వాకింగ్‌ వంటి పనులు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఆక్సిజెన్‌ శరీరానికి అందుతుంది. జంక్ ఫూడ్స్‌కి బదులుగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది.  ఎల్లప్పుడు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది.

ఏదైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించడానికి వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. కాబట్టి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ధూళి, పొగ వంటివి ఊపిరితిత్తులలో అలెర్జీని కలిగిస్తాయి. కాబట్టి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.

ముఖ్యమైన విషయం: ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
 

Also read: Camphor: కర్పూరం బిల్లతో లాభాలెన్నో .. ఒళ్లు నొప్పులు మాయం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News