Low GI: గ్లైసమిక్ సూచి తక్కువగా ఉండే 6 ఆహారాలు.. ప్రతిరోజూ మీ డైట్‌లో ఇవి ఉండాల్సిందే..

Low Glycemic Index Foods:  ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు వారు గ్లైసెమిక్‌ సూచి తక్కువగా ఉండే ఆహారాలు వారు డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా అన్ని ఆహారాలు గ్లైసెమిక్ సూచి సున్నా నుండి 100 ఉంటుంది.

Written by - Renuka Godugu | Last Updated : Sep 27, 2024, 08:48 PM IST
Low GI: గ్లైసమిక్ సూచి తక్కువగా ఉండే 6 ఆహారాలు.. ప్రతిరోజూ మీ డైట్‌లో ఇవి ఉండాల్సిందే..

Low Glycemic Index Foods: బరువు తగ్గడానికి గ్లైసెమిక్ సూచీ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలంటారు అంతేకాదు రక్తంలో షుగర్ లెవెల్స్ ని కూడా నియంత్రణలో ఉంచుతాయి. అదనపు కేలరీలను తగ్గిస్తుంది తక్కువగా ఉండే ఆహారాలు బెల్లీ ఫ్యాట్ రాకుండా నివారిస్తాయి. మీరు కూడా మీ డైట్ లో జిఐ తక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకుంటున్నారా?

ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు వారు గ్లైసెమిక్‌ సూచి తక్కువగా ఉండే ఆహారాలు వారు డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా అన్ని ఆహారాలు గ్లైసెమిక్ సూచి సున్నా నుండి 100 ఉంటుంది. మీ తక్కువగా ఉంటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి, ఎక్కువగా ఉండేటి తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

గ్లైసేమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలు జాబితా తెలుసుకుందాం..

ఇదీ చదవండి: భారీ వర్షాలు రెడ్‌ అలెర్ట్‌.. అన్నీ స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటన..

కూరగాయలు...
గంజి పదార్థం లేని కూరగాయలలో ఖనిజాలు పుష్కలంగా ఉండే వాటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అయితే ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను నెమ్మదిస్తుంది దీంతో కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది. ముఖ్యంగా బ్రోకోలి, పాలకూర, కాలే, కాలీఫ్లవర్, బీన్స్ వంటివి డైట్లో చేర్చుకోవాలి. ఇందు జి ఐ తక్కువగా ఉంటుంది.

బెర్రీ పండ్లు ..
బెర్రీ ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం ఇది మన డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ విటమిన్స్ ఉంటాయి. నాచురల్ గా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే జిఐ తక్కువగా ఉండాలి. అంటే షుగర్ వ్యాధిగ్రస్తులను బెర్రీ పండ్లను కూడా డైట్లో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా బ్లూబెర్రీస్, స్ట్రాబెరీలు, క్రాన్ బెర్రీ, బ్లాక్ బెర్రీ వంటివి అందుబాటులో ఉంటే వీటిని నేరుగా తినవచ్చు లేకపోతే యోగార్ట్‌లో వేసుకొని కూడా తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: ఈ నూనె పెట్టండి జుట్టు నడుం వరకు మందంగా పెరుగుతుంది..

గింజలు, విత్తనాలు..
కొన్ని రకాల గింజలు విత్తనాలు కూడా జిఐ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు స్నాక్ రూపంలో తీసుకోవటం వల్ల కూడా అతిగా ఆకలి వేయకుండా ఉంటుంది. బాదం, వాల్నట్స్, పిస్తా, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, గుమ్మడి గింజలు చేర్చుకోవడం వల్ల జిఐ లెవెల్స్ అదుపులో తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి.

ఓట్ మిల్..
ఓట్ మీలో కూడా జిఐ తక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఓట్ మిలో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇది ఎక్కువ సమయం పాటు మనకు శక్తి అందిస్తుంది. వీటిని బెర్రీ పండు, గింజలు, తేనెతో కలిపి తీసుకోవటం వల్ల మంచి బ్రేక్ ఫాస్ట్ తయారవుతుంది. ఇందులో జి ఐ స్థాయిలు తక్కువగా ఉంటాయి.

యోగర్ట్‌..
గ్రీక్ యోగర్ట్ లో ప్రోటీన్, క్యాల్షియం  పుష్కలంగా ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి జీర్ణ క్రియను మెరుగు చేస్తాయి. షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండాలంటే యోగర్ట్‌లో కొన్ని రకాల పండ్లు వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారవుతుంది లేకపోతే దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో కూడా తినవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News