Natural Herbs: ఆధునిక జీవితంలో మోకాలి నొప్పులు, భుజం నొప్పులు సర్వ సాధారణంగా మారాయి. పాదాలు, కాళ్ల నుంచి చేతులు, భుజం వరకూ జాయింట్ పెయిన్స్ సమస్య ఎక్కువవుతోంది. ఈ నేపధ్యంలో ప్రకృతి సిద్ధమైన ఆరు సహజ మూలికలతో ఈ నొప్పుల్నించి విముక్తి పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
జాయింట్ పెయిన్స్ (Joint Pains) అనేది శరీరంలోని ఏ జాయింట్‌లో అయినా వస్తుంది. జాయింట్ పెయిన్‌కు క్లినికల్ పదం అర్థరాల్జియా. రెండు ఎముకలు కలిసే చోట లేదా ఆ రెండు ఎముకల కదలిక స్థానంలో భరించలేని నొప్పి ఉంటుంది. రెండు ఎముకలు కలిసే చోట కదిలేందుకు వీలుగా కార్టిలేజ్ ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ భాగంలో నొప్పి ఎక్కువవుతుంది. జాయింట్ ఇన్‌ఫ్లమేషన్ నొప్పికి దారి తీస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. జాయింట్ పెయిన్ అనేది ఒక్కోసారి నెమ్మదిగా ప్రారంభమై..తీవ్రమౌతుంది. ఒక్కోసారి దానికదే పోతుంది కూడా. క్రానిక్ పెయిన్‌గా మారితే మాత్రం మూడు నెలల వరకూ ఉంటుంది. దాంతో డాక్టర్ల చుట్టూ తిరగడం, దీర్ఘకాలంగా మందులు వాడటం వంటివి ఎదురౌతాయి.
అయితే ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే ఆయుర్వేద మూలికలతో (Natural Herbs) ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద వైద్య విధానంలో జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పులకు చాలా సులభంగా నియంత్రించవచ్చంటున్నారు. సర్జరీలు, ఇతర మందుల ద్వారా చాలా రకాల దుష్పరిణామాలు ఎదురవుతాయి. అదే ఆయుర్వేద వైద్యవిధానంలో ఆ సమస్య ఉండదంటున్నారు. ఈ ఆయుర్వేద మందులు దీర్ఘకాలికంగా ఈ సమసల్ని నయం చేస్తాయి.
అశ్వగంధ (Aswagandha)
ఆయుర్వేద వైద్య విధానంలో (Ayurveda Medicine) ఆశ్వగంధకు చాలా ప్రముఖ స్థానముంది. ఇది పెయిన్ కిల్లర్‌గా, సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ నియంత్రించే ఇన్‌ఫ్లమేటరీ గుణాల్ని నియంత్రిస్తుంది. చాలా రకాల జాయింట్ పెయిన్స్‌కు అశ్వగంధ మంచి మందుగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆర్ధరైటిస్ మెరుగుపర్చడంలో, నెర్వస్‌నెస్ తగ్గించడంలో అశ్వగంధ చాలా బాగా ఉపయోపడుతుంది.
గుగ్గుల్ (Guggul)
గుగ్గుల్ అనేది అద్భుతమైన పెయిన్ రిలీవర్‌గా పని చేస్తుంది. చర్మ సంబంధిత నొప్పుల్నించి కూడా విముక్తి ప్రసాదిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఉన్నాయి.
షిలాజిత్ (Shilajit)
షిలాజిత్ అనేది మరో అద్భుతమైన వనమూలిక. హిమాలయ పర్వత శ్రేణుల్లో తొలిసారిగా వెలుగు చూసింది. వందలాది సంవత్సరాల్నించి షిలాజిత్ ప్లాంటేషన్ జరుగుతోంది. అద్భుతమైన ఆంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన షిలాజిత్‌ను పెయిన్ కిల్లర్‌గా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్ధరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర రుగ్మతల్లో మంచి ఫలితాలనిస్తుంది.
సురంజన్ (Suranjan)
సురంజన్ వనమూలికలో ఉన్న యాంటీ ఆర్ధరైటిక్ యాక్టివిటీ చికిత్సలో చాలా దోహదపడుతుంది. ఇది కూడా రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌లో ఉపయోగపడుతుంది. ఇది నొప్పిని తగ్గించడంలో రుమాటిజమ్‌ను నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. మరోవైపు సెక్సువల్ సామర్ధ్యం పెంచడంలో దోహదపడుతుంది.
టర్మరిక్ (Turmeric)
ఇక పసుపు సుదీర్ఘకాలంగా , వందలాది ఏళ్లుగా అద్బుతమైన మెడిసిన్‌గా వాడుకలో ఉంది. జాయింట్ ఇన్‌ఫ్లమేషన్, ఆర్ధరైటిస్ చికిత్సలో పసుపు వాడుతుంటారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలతో నొప్పి వెంటనే నయమవుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో పసుపుని మించింది లేదు.
గ్లూకోసమిన్ మరియు కోండ్రోయిటిన్ (Glucosamine and Chondroitin)
జాయింట్స్ వద్ద ఉండే కార్టిలేజ్‌లో గ్లూకోజమిన్, కోండ్రోయిటిన్‌లు అంతర్భాగమై ఉంటాయి. ఇవి శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి. ఇవి లోపిస్తేనే వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. జాయింట్స్‌లో ఉండే లిగమెంట్ డిసింటిగ్రేషన్‌ను ఇవి దూరం చేస్తాయి.
Also read: Peanuts Side Effects: డయాబెటిస్ (షుగర్) వ్యాధిగ్రస్తులు వేరుశనగ తినడం ఆరోగ్యానికి హానికరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి