How To Improve Kidney Function: శరీరంలోని మూత్రపిండాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇవి చూడడానికి బీన్స్ ఆకారంలో కలిగి ఉంటాయి. మూత్రపిండాలు రక్తంలోని వ్యర్ధపదార్థాలను తొలగించి రక్త సరఫరా వ్యవస్థని సులభతరం చేస్తాయి. కాబట్టి మూత్రపిండాలను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిది లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చి ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవనశైలి కారణంగా చాలామందిలో మద్యపానం, ధూమపానం అలవాట్లు ఎక్కువయ్యాయి. దీని కారణంగా కూడా చాలామందిలో మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. అయితే మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా మంచిది. లేకపోతే సమస్యలు మరింత తీవ్రతరమై దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడే ఛాన్స్ లు ఉన్నాయి. ఇప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటించండి.
ఇలా తప్పకుండా చేయండి:
మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజు అందరూ తీసుకునే నీటి కంటే అధిక మొత్తంలో తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలోని వ్యర్ధపదార్థాలు తొలగిపోవడమే.. కాకుండా శరీరంలో పేరుకుపోయిన హానికరమైన పదార్థాలు బయటికి వస్తాయి. అంతేకాకుండా సరైన మోతాదులో నీటిని తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగండి:
ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు ఐదు నుంచి ఆరు గ్లాసుల చొప్పున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన విషపూరితమైన వ్యర్ధాలు బయటికి వస్తాయి. దీంతోపాటు గొంతు ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!
రోజంతా నీటిని తాగుతూనే ఉండాలి:
మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 30 నిమిషాల నుంచి 40 నిమిషాల లోపు సగం గ్లాసు చొప్పున నీటిని తాగుతూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండడమే కాకుండా కిడ్నీలపై ఎలాంటి భారం పడకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రక్తంలోని మలినాలు కూడా సులభంగా బయటికి వస్తాయి.
హెర్బల్ టీ:
సోంపు, జీలకర్ర, కొత్తిమీర గింజలతో తయారుచేసిన హెర్బల్ టీలను ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని వ్యర్ధపదార్థాలను తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ టీలను ప్రతిరోజు తాగచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook