Covaxin Vaccine: కరోనా మహమ్మారి నియంత్రణకై దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ విషయంలో కీలక ప్రకటన వెలువడింది.
దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్(Covishield),స్పుత్నిక్ వి(Sputnik V)వ్యాక్సిన్లతో పాటు మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ అందుబాటులో ఉన్నాయి. త్వరలో అందుబాటులో రానున్న జైకోవ్ డి తప్ప మిగిలినవన్నీ రెండు డోసుల వ్యాక్సిన్లే. ఈ క్రమంలో కోవాగ్జిన్ విషయంలో కీలక ప్రకటన వెలువడింది. కరోనా సోకి తగ్గిన వ్యక్తికి కోవాగ్జిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌తో యాంటీబాడీల స్పందన కన్పిస్తోందని ఐసీఎంఆర్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఐసీఎంఆర్(ICMR) తాజా అధ్యయనం వివరాల్ని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురించారు. కరోనా సోకి తగ్గినవారికి కోవాగ్జిన్(Covaxin) సింగిల్ డోసు వ్యాక్సిన్ సరిపోతుందని ఈ అధ్యయనం భావిస్తోంది. తాజా అధ్యయనంలో కొంతమంది హెల్త్ కేర్ వర్కర్ల నుంచి కొందరిని ఎంపిక చేసుకుని..వారికి వ్యాక్సిన్ ఇచ్చిన రోజు, 28వ రోజు, 56వ రోజు యాంటీబాడీలు(Antibodies)ఎలా ఉన్నాయనేది నమోదు చేశారు. అంతకుముందు కోవిడ్ లేని వ్యక్తుల్లో వ్యాక్సిన్‌తో వచ్చిన యాంటీబాడీల స్పందనను, కోవిడ్ సోకిన అనంతరం సింగిల్ డోసు తీసుకున్నవారిలో వచ్చిన యాంటీబాడీల స్పందనతో సరిపోల్చారు. రెండు కేసుల్లోనూ యాంటీబాడీల స్పందన సమానంగా ఉన్నట్టు తేలడంతో..కోవిడ్ బాధితులకు కోవాగ్జిన్ ఒక్క డోసు(Covaxin single dose) సరిపోతుందని ఐసీఎంఆర్ వెల్లడించింది.
Also read: Vaccination: కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా బయటకు తిరుగుతున్నారా..! ఈ షాకింగ్ న్యూస్ మీకే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook