How To Lose Weight In 15 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే పెరుగుతున్న బరువు తగ్గించుకోవడానికి తప్పకుండా పలు రకాల వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. బిజీ లైఫ్ కారణంగా వ్యాయామాలు చేయలేకపోతున్నారు. ఎలాంటి వ్యాయామాలు చేయకుండా ఎలా బరువు తగ్గాలనే అంశంపై చాలా మంది డైటీషియన్స్‌ను సంప్రదిస్తున్నారు. అయితే వీరు తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరు చెప్పిన నియమాలు పాటిస్తే తప్పకుండా కేవలం 15 రోజుల్లో మీ బరువు 5 కిలోలు తగ్గవచ్చు. అయితే ఈ డైట్ చార్ట్‌లో సరైన ఆహారాన్ని సమతుల్య పద్ధతిలో తినడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని వారు చెబుతున్నారు.
ఇలా డైట్‌లో సూచించిన నియమాలు పాటించాల్సి ఉంటుంది:
ఉదయం:
ముందుగా నిద్ర లేచిన తర్వాత నోటిని శుభ్రం చేసుకుని.. 2 గ్లాసుల నీరు త్రాగాలి, తక్కువ కొవ్వు ఉన్న పాలు లేదా స్కిమ్డ్ మిల్క్‌తో ఉదయం టీని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ టీలో అస్సలు చక్కెరను వినియోగించవద్దు. అయితే చక్కెరకు బదులుగా బెల్లాన్ని వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అల్పాహారం:
ఉదయం అల్పాహారంలో భాగంగా కాచిన రాగులతో చేసిన జావా, మూంగ్ దాల్ జావా తీసుకోవాలి. అంతేకాకుండా ఈ పిండితో దోసలు కూడా చేసుకుని తినొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మధ్యహ్నం స్నాక్స్:
మధ్యహ్నం సమయంలో 5 నుంచి 6 నానబెట్టిన బాదంపప్పులు, 2 నుంచి 4 వాల్‌నట్స్ , 8 నుంచి10 నానబెట్టిన ఎండుద్రాక్షలను పచ్చి కొబ్బరి మిశ్రమంతో కలిపి తినవచ్చు.
మధ్యాహ్నం భోజనం:
పచ్చి కూరగాయలతో పాటు క్యాప్సికం, పనీర్‌ను కర్రీతో పాటు మల్టీగ్రెయిన్ రోటీ తినొచ్చు. అంతేకాకుండా ఈ క్రమంలో జీరాతో చేసన ఆహారాలను కూడా తీసుకోవచ్చు. వంటలు వండుకునే క్రమంలో 1 టీస్పూన్ కంటే ఎక్కువ నూనె లేదా నెయ్యిని మాత్రమే వినియోగించాలి. భోజనం తీసుకున్న తర్వాత మజ్జిగ తీసుకోవాలి.
సాయంత్రం స్నాక్స్:
ఆరోగ్యకరమైన స్నాక్ మాత్రమే తీసుకోవాలి. కాల్చిన మఖానా, వేయించిన వేరుశెనగలు, కాల్చిన గింజల మాత్రమే స్నాక్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. చక్కెరకు బదులుగా బెల్లం టీలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రి భోజనం:
రాత్రి భోజనంలో కేవలం ఒక మల్టీగ్రెయిన్ రోటీ లేదా ఒక రాగిని రోటినే తీసుకోవాల్సి ఉంటుంది. డిన్నర్‌లో ఇలా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్య సులభంగా బరువు తగ్గుతారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook