Hibiscus Remedies: మందారం పూలను సాధారణంగా హెయిర్ కేర్ లేదా బ్యూటీ కేర్ ఉత్పత్తుల్లో వినియోగిస్తుంటారు. కానీ మందారం పూలతో ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని చాలామందికి తెలియదు. మందార పూలలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. సరైన పద్ధతిలో వాడితే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యకు చెక్ చెప్పవచ్చు.
మందారం లేదా హైబిస్కస్. చాలా అందమైన పూవు. ఇంటి పెరట్లో ఉంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా అందిస్తుంది. మందారం పూలను చాలాకాలంగా ఆయుర్వేద మందుల్లో వాడుతున్నారు. పూలు, ఆకులు, కాండలతో కాడా తయారు చేసి చాలా వ్యాధుల్లో చికిత్సగా ఉపయోగిస్తుంటారు. మందారంలో ఆరోగ్యపరమైన పోషకాలు చాలా ఉంటాయని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. మందారంను ఆరోగ్యపరమైన ప్రయోజనాల కోసం వాడాలంటే కాడా చేసుకుని తాగడం అత్యుత్తమ విధానం. దీనికోసం ఓ కప్పు నీళ్లు ఉడకబెట్టి అందులో టీ వడకాచే దాంట్లో కొన్ని డ్రై మందార పూలను వేయాలి. మరి కాస్సేపు అలానే నీళ్లను మరిగించాలి. 5 నిమిషాల తరువాత టీ వడకాచేది తొలగించి ఆ నీటిలో రుచి కోసం కొద్దిగా తేనె, నిమ్మరసం పిండుకుని టీ కింద తాగవచ్చు. రోజుకు 1-2 కప్పులు తాగితే చాలా లాభదాయకం.
బరువు నియంత్రణ అతి ముఖ్యమైంది. మందారం కాడా బరువు నియంత్రణ ప్రక్రియలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆకలి తగ్గుతుంది. ఇది బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రేవుల్లో ఉన్న మలాన్ని సులభంగా బయటకు తొలగిస్తుంది. మలబద్ధకం సమస్య దూరమౌతుంది
మందారం కాడా తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఏంథోసయానిన్ కారణంగా రక్త నాళాలు వ్యాకోచించేలా చేస్తుంది. ఇది రక్త ప్రసరణను సక్రమం చేస్తుంది. మందారంలో ఉండే విటమిన్ సి కారణంగా ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. దాంతో సీజనల్ ఇన్‌ఫెక్షన్లు దూరమౌతాయి.అన్నింటికీ మించి లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది. లివర్ పనితీరు మెరుగుపరుస్తుంది.
Also read: Railways New Scheme: రైల్వే కొత్త స్కీమ్, డబ్బుల్లేకుండానే టికెట్ బుకింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి