Herbal Tea For Diabetes: మధుమేహం నియంత్రణ కోసం ఇవి తాగండి..!

Herbal Tea For Diabetes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2022, 05:04 PM IST
  • మధుమేహం నియంత్రణలో ఉండడం లేదా..
  • హెర్బల్ టీని తాగండి
  • రక్తంలో చక్కెర నియంత్రనలో ఉంటుంది
Herbal Tea For Diabetes: మధుమేహం నియంత్రణ కోసం ఇవి తాగండి..!

Herbal Tea For Diabetes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆహారం తీసుకునే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెరతో ఉన్న టీని తాగుతున్నారు. దీని వల్ల ఈ సమస్య ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి ఆరోగ్య నిపుణు పలు రకాల హెర్బల్ టీలను తాగమని సూచిస్తున్నారు. అవేవంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ హెర్బల్ టీలు శరీరానికి చాలా మంచిది:

హల్దీ హెర్బల్ టీ(Haldi Herbal Tea):

టర్మరిక్ టీ మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పసుపులో ఔషధ గుణాలు అధికంగా ఉండడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది డయాబెటిక్ పేషెంట్లలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

పసుపు హెర్బల్ టీని ఎలా తయారు చేయాలి:

 పసుపు టీ తయారు చేయడం చాలా సులభం.. దీని కోసం అర అంగుళం పచ్చి పసుపును తీసుకుని, ఒక గ్లాసులో రాత్రంతా నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని మరిగించి, వడగట్టి తాగాలి. ఇలా క్రమం తప్పకుంగా తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.

మందార హెర్బల్ టీ (Hibiscus Herbal Tea):

మందార హెర్బల్ టీ శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను తొలగించేందుకు ఎంతగానో దోహదపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

మందార టీ ఎలా తయారు చేయాలి? :

మందార పువ్వుల ఆకులను ఎండబెట్టి.. ఆ తర్వాత ఈ ఆకులను 4 నుంచి 5 నిమిషాలు నీటిలో ఉంచి.. అందులో కొద్దిగా నిమ్మరసం, తేనెను వేసి మరిగించాలి. 10 నిమిషాల పాటు మరిగించి వడపోయాలి.. ఆ తర్వాత దీనిని టీలా తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహ వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Mango Peels Benefits: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇలా మామిడి తొక్కతో ఉపశమనం పొందండి..!

 

Also Read:  Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పండ్లను తప్పకుండా తీసుకుంటే.. ఎలాంటి వ్యాధులు మీ చుట్టుముట్టవు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News