Chocolate Benefits: ఒక్క చాక్లెట్ వల్ల ఇన్ని ఉపయోగాలా.. ఇక రోజూ చాక్లెట్ తినేయచ్చు..

Dark Chocolate : చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయి..అంటూ చిన్నపిల్లలను తినకుండా పెద్దవాళ్లు ఆపేస్తూ ఉంటారు. పెద్దవాళ్లు కూడా బరువు తగ్గాలంటే చాక్లెట్లు తినకూడదు అంటూ వాటిని దూరం చేస్తూ ఉంటారు. కానీ చాక్లెట్స్ వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా? అవును, చాక్లెట్ వల్ల ఆరోగ్యానికి మేలు కూడా జరుగుతుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 28, 2024, 04:00 PM IST
Chocolate Benefits: ఒక్క చాక్లెట్ వల్ల ఇన్ని ఉపయోగాలా.. ఇక రోజూ చాక్లెట్ తినేయచ్చు..

Dark Chocolate for Weight Loss : చాక్లెట్ల అంటే ఇష్టంలేని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరూ చాక్లెట్ అనగానే పరిగెత్తుకుంటూ వస్తారు. తీయటి చాక్లెట్లు తింటూ.. ఉండడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాల కంటే ఎక్కువ నష్టాలే ఉంటాయి అని కొందరు బలంగా నమ్ముతారు. 
ఇక పళ్ళు పుచ్చిపోతాయి అంటూ చిన్న పిల్లల్ని కూడా చాక్లెట్ల జోలికిపోనివ్వరు. అప్పుడప్పుడు ఒకటి..అరా.. తప్ప సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని చాక్లెట్లకి దూరంగానే ఉంచుతారు. అందులో ఎలాంటి తప్పు లేదు కానీ.. మరి అంతలా చాక్లెట్లకి దూరంగా ఉండాల్సిన అవసరం లేదట. 

ఎందుకంటే చాక్లెట్ల వల్ల మనకి కలిగే ప్రయోజనాలు కూడా కొన్ని ఉన్నాయి. చాక్లెట్ అంటే మామూలుగా మనం తినే చాక్లెట్లు కాదు.. ఇక్కడ చెబుతూఉండేది డార్క్ చాక్లెట్ గురించి... ఈ డార్క్ చాక్లెట్స్ లో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఈ డార్క్ చాక్లెట్ తినడం వల్ల.. ఆరోగ్యానికి కొన్ని కొంత మేలు కూడా చేకూరుతుంది అని ఈ మధ్యనే దక్షిణ కొరియన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 

డార్క్ చాక్లెట్ లో ఉండే పదార్థాలు మన జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేలా చూస్తాయట. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూక్ష్మజీవులు (మైక్రోబ్స్) పై డార్క్ చాక్లెట్ ప్రభావం కూడా పడి.. మరింత ఆరోగ్యకరంగా మారుతామని పరిశోధనలో తేలింది. 

అంతేకాదు దాదాపు 85% డార్క్ చాక్లెట్ ఉండి, తక్కువ చక్కర కలిగి ఉన్న..30 గ్రాముల చాక్లెట్ రోజుకి మూడు సార్లు చొప్పున తీసుకుంటే.. మన మూడ్ స్వింగ్స్ కూడా తగ్గిపోయి ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా ఉంటామట. అంతేకాకుండా డార్క్ చాక్లెట్ మన ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. అందులో ఉండే కోకో పౌడర్లో ఫైబర్ తో పాటు ఐరన్ కూడా ఉంటుంది. అవి మనకు ఫైటో కెమికల్స్ క్యాన్సర్లు, మతిమరుపు (డిమెన్షియా), ఆర్థరైటిస్, గుండె జబ్బులు, పక్షవాతం వంటి అనేక సమస్యలను నివారిస్తాయని తెలుస్తోంది. 

అసలు మన భాగవద్వేగాలకు చాక్లెట్ కి ఉన్న సంబంధం గురించి తెలియనప్పటికీ తాజా పరిశోధనలలో మాత్రం డార్క్ చాక్లెట్ మన మూడ్ ని ప్రభావితం చేస్తుందని మనం సంతోషంగా ఉండటానికి తోడ్పడుతుంది అని పరిశోధకులు కనుగొన్నారు. 

చిన్న మోతాదుల్లో రోజూ మూడుసార్లు చాక్లెట్ తిన్నవారిని పరీక్షించగా.. వారిలో బ్లాపుసియా అనే ఒక ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఎక్కువ మోతాదులో ఉందని.. దానివల్ల వారు సంతోషంగా ఆహ్లాదంగా ఉంటూ వారి మూడ్ బాగుంటుంది అని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి మనం ఆనందంగా ఆహ్లాదంగా ఉండటానికి కూడా డార్క్ చాక్లెట్ బాగా ఉపయోగపడుతుంది.

Read more: Doctor left surgery: ఆకలేస్తోంది.. మసాల దోశ తినేసి వస్తా.. సర్జరీ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్..

Read More: Pune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News