Garlic Uses: శరీరంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం స్థూలకాయం. ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా పెరిగిపోయింది. స్థూలకాయం కారణంగా వివిధ రకాల వ్యాధులు ఉత్పన్నమౌతుంటాయి. వీటిలో అతి ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్.
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ వ్యాధుల ముప్పు వెంటాడుతుంటుంది. కొలెస్ట్రాల్ కారణంగా డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందాలి. కొలెస్ట్రాల్ అనేది రక్త నాళాల్లో పేరుకుని ఉంటుంది. కొన్నిసార్లు ఇది గట్టకడుతుంటుంది. రక్త ప్రసరణలో ఇది ఇబ్బందిగా మారుతుంది. రక్తనాళాల్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం, గుండెపోటు, నరాల సమస్య వంటివి ఉత్పన్నమౌతాయి. అందుకే మొట్టమొదటిగా చేయాల్సింది కొలెస్ట్రాల్ తగ్గించడమే.
కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ప్రకృతిలో చాలా రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అద్భుతమైంది వెల్లుల్లి థెరపీ. వెల్లుల్లితో చాలా సులభంగా కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. వెల్లుల్లిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది వెల్లుల్లి. చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా నిర్మూలిస్తుంది.
వెల్లుల్లి-నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల లిపిడ్ స్థాయి తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రోజుకు సగం లేదా ఒక వెల్లుల్లి రెమ్మ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని 10 శాతం తగ్గించవచ్చని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి కారణంగా ఫ్రీ రాడికల్స్‌ను సులభంగా నాశనం చేయవచ్చు. వెల్లుల్లిలో పోషక గుణాలు గుండెను సదా ఆరోగ్యంగా ఉంచుతాయి.
వెల్లుల్లిలోని విటమిన్ బి6 ఎర్ర రక్త కణాల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా రక్త నాళాల్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ను సమూలంగా నిర్మూలిస్తుంది.
Also read: Diabetes Control Tips: మధుమేహం వ్యాధిగ్రస్థులు అంజీర్ తినవచ్చా లేదా, వాస్తవమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook