Cucumber Salad For Diabetes: ఆధునిక కాలంలో చిన్న పెద్ద అనే వయసు సంబంధం లేకుండా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ సమస్య బారిన పడేవారి సంఖ్య రోజు రోజూకు పెరుగడం గమనార్హం. డయాబెటిస్ ఉన్నారు ఆహార విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అందులోను షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. అయితే ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ దోసకాయ సలాడ్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ సలాడ్ దోసకాయ తో తయారు చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి..? డయాబెటిస్‌కు ఎలా సహాయపడుతుంది అనేది వివరాలు తెలుసుకుందాం.
దోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అలాగే కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గించడంలో, డయాబెటిస్ రోగులకు మేలు చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్‌ను వేగంగా పెంచకుండా ఉంటుంది. గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ కే, సి, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇది డయాబిస్ వారికి చాలా మేలు చేస్తుంది. ఈ దోసకాయను ఉపయోగించి సలాడ్ తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే దీని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం.
దోసకాయం సలాడ్ తయారీ విధానం
కావాల్సిన పదార్థాలు:
దోసకాయ - 1 (తొక్క తీసి ముక్కలుగా కోసి)
పచ్చిమిర్చి - 2-3 (చిన్న ముక్కలుగా కోసి)
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - రుచికి తగినంత
నిమ్మరసం - 1 నిమ్మకాయ
కొత్తిమీర - కొద్దిగా (చిన్నగా తరిగి)
పుదీనా ఆకులు - కొద్దిగా (చిన్నగా తరిగి)
తయారీ విధానం:
దోసకాయను బాగా కడిగి, తొక్క తీసి, త్రికోణాకార ముక్కలుగా కోసుకోండి. పచ్చిమిర్చి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. కొత్తిమీర, పుదీనా ఆకులను చిన్నగా తరిగి పెట్టుకోండి. ఒక పాత్రలో దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి బాగా కలపండి. తయారైన సలాడ్‌ను వెంటనే సర్వ్ చేయండి.
అదనపు టిప్స్:
రుచికి తగినంత ఉప్పు, నిమ్మరసం వేసుకోండి.
నచ్చిన ఇతర కూరగాయలను కూడా ఈ సలాడ్‌లో చేర్చవచ్చు. ఉదాహరణకు, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ.
ఈ సలాడ్‌ను చల్లగా సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది.
ఈ సలాడ్‌ను ముందుగా తయారు చేసి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. సర్వ్ చేయడానికి ముందు కొద్దిగా నిమ్మరసం వేసి కలపండి.
Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook