Eye Care Diet: మీ రెగ్యులర్ డైట్‌లో ఈ పదార్ధాలు చేరిస్తే..కంటి వెలుగు పెరగడం ఖాయం

Eye Care Diet: కంటి సంరక్షణ చాలా అవసరం. కళ్లు లేకపోతే జీవితమంతా అంధకారమే. అందుకే ఎప్పటికప్పుడు కళ్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కంటి వెలుతురు పెంచేందుకు కొన్ని రకాల పండ్లు, కూరగాయలు డైట్‌లో యాడ్ చేసే మంచి ఫలితాలుంటాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 7, 2022, 06:56 PM IST
Eye Care Diet: మీ రెగ్యులర్ డైట్‌లో ఈ పదార్ధాలు చేరిస్తే..కంటి వెలుగు పెరగడం ఖాయం

Eye Care Diet: కంటి సంరక్షణ చాలా అవసరం. కళ్లు లేకపోతే జీవితమంతా అంధకారమే. అందుకే ఎప్పటికప్పుడు కళ్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కంటి వెలుతురు పెంచేందుకు కొన్ని రకాల పండ్లు, కూరగాయలు డైట్‌లో యాడ్ చేసే మంచి ఫలితాలుంటాయి..

ఆధునిక జీవనశైలి, పోటీ ప్రపంచంలో నిత్యం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ ముందు ఉండటం తప్పనిసరి లేదా హ్యాబిట్‌గా మారింది. ఈ క్రమంలో ఆరోగ్యంపై ముఖ్యంగా కంటిపై తీవ్ర ప్రభావం పడుతోంది. కంటి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. స్క్రీన్‌లైట్ కళ్లకు హాని కల్గిస్తున్నాయి. ఫలితంగా వివిధ రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కళ్లు బలహీనంగా మారుతున్నాయి. కళ్లలో మంట, దురద వంటి ఇబ్బందులు ఎదురౌతున్నాయి. కంటి వెలుతురు తగ్గిపోతోంది. దృష్టి లోపం సమస్యగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో డైట్‌లో కొన్ని పదార్ధాల్ని చేర్చడం ద్వారా కంటి సంరక్షణ చేసుకోవచ్చు.

1. ఉసిరి కంటికి చాలా మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల కంటి వెలుతురు పెరుగుతుంది. ఉసిరి పౌడర్, ఉసిరి పచ్చడి వంటివి దోహదపడతాయి. ఉసిరి నేరుగా కూడా రోజూ తీసుకోవచ్చు.

2. ఆకుపచ్చని కూరగాయలతో కూడా కంటి సంరక్షణ చేసుకోవచ్చు. పచ్చని కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి ఉంటాయి. మరోవైపు యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ల్యూటిన్ గుణాలు కంటి వెలుగు పెంచుతాయి.

3. అవకాడోలో విటమిన్ ఇ సంపూర్ణంగా ఉంటుంది. ఫలితంగా కంటి రెటీనా పటిష్టమౌతుంది. వృద్ధాప్యం వచ్చేవరకూ కళ్లు ఆరోగ్యంగానే ఉంటాయి.

4. కేరట్‌లో పుష్కలంగా ఉండే బీటా కెరోటిన్ కంటి వెలుగు పెంచడంలో కీలకం. కేరట్‌లో ఉండే విటమిన్ ఎ  కంటికి చాలా మంచిది.

5. సీఫుడ్స్ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ట్రూనా, సాల్మన్, ట్రౌట్ వంటి సీఫుడ్‌లు రెటీనాను పటిష్టపరుస్తాయి. ఈ చేపల్లో డీహెచ్ఏ పేరుతో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రెటీనా సామర్ధ్యాన్ని, శక్తిని పెంచుతాయి.

6. సిట్రస్ ఫ్రూట్స్‌లో బత్తాయి, నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, అమ్రూద్‌లు చాలా మంచివి. ఇందులో ఉండే విటమిన్ సి, సైట్రిక్ యాసిడ్ కళ్లకు చాలా ఉపయోగకరం.

7. ఇక బాదం, వాల్‌నట్ వంటి డ్రైఫ్రూట్స్ వల్ల కళ్లకు చాలా లాభాలున్నాయి. కంటి వెలుగు పెరుగుతుంది. రోజూ డ్రైఫ్రూట్స్ తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

ఎక్కువసేపు అదే పనిగా స్క్రీన్‌పై పనిచేస్తుంటే చాలా ఇబ్బందులుంటాయి. కంటిన్యూగా ఎక్కువసేపు పనిచేసే బదులు..మద్యమధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలి. దీనికోసం 20-20 నిబంధన పాటిస్తే ఫలితాలుంటాయి. 20 నిమిషాలు పనిచేసిన తరువాత కాస్సేపు బ్రేక్ తీసుకుని..20 సెకన్లు స్క్రీన్ నుంచి దూరంగా ఉండాలి. ఈ సమయంలో కళ్లను మూస్తూ ఉండాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. 

కళ్లలో మంటగా ఉంటే తరచూ చల్లని నీళ్లతో కడుగుతూ ఉండాలి. కళ్లను శుభ్రం చేసేందుకు రోజ్ వాటర్ వినియోగిస్తే మంచిది. 

Also read: Diabetes Control Tips: పది రోజుల్లో సబ్జా విత్తనాలతో డయాబెటిస్‌కు ఇలా చెక్ పెట్టొచ్చు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News