Frequent Urination: చాలామంది తరచూ మూత్రం వస్తుంటే తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది మంచిది కాదంటున్నారు వైద్యులు. రోజుకు ఎన్ని సార్లు మూత్రానికి వెళ్తున్నారు, ఎన్ని సార్లు వెళ్లాలనే విషయంపై అవగాహన అవసరం. సకాలంలో ఈ సమస్యను చెక్ చేయించుకోవాలి. లేకపోతే వ్యాధిగ్రస్థులయ్యే ప్రమాదం ఉంది.
మూత్రం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. రోజుకు ఎన్ని సార్లు వెళ్తున్నారనే విషయంతో పాటు మూత్రం ఏ రంగులో ఉంటుంది, ఎంత పరిమాణంలో వస్తోందనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది మూత్ర సంబంధిత సమస్యల్ని తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఈ సమస్యల్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర పరిణామాలుంటాయంటున్నారు వైద్య నిపుణులు. శరీరంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడే మూత్ర సంబంధిత ఇబ్బందులు ఎదురౌతాయి.కొంతమంది తరచూ అంటే రోజుకు చాలాసార్లు మూత్రానికి వెళ్తుంటారు. ఇది మంచిది కాదు.
రోజుకు తరచూ మూత్రం వస్తుందంటే దీనికి చాలా కారణాలుంటాయి. అన్నింటికంటే ప్రదాన కారణ బ్లేడర్ ఓవర్ యాక్టివ్‌గా ఉండటం. దీనివల్ల ఆ వ్యక్తి తరచూ మూత్రానికి వెళ్తుంటాడు. అంతేకాకుండా డయాబెటిస్, యూరిన్ ఇన్‌ఫెక్షన్ , ప్రోస్టేట్ కేన్సర్ వంటి రోగాలున్నప్పుడు కూడా తరచూ మూత్ర సమస్య ఉత్పన్నమౌతుంది.
కొంతమంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వాడే మందుల వల్ల కూడా తరచూ మూత్ర విసర్జన సమస్య ఉంటుంది. మహిళలు గర్భిణీగా ఉన్నప్పుడు, పురుషులకు 50 ఏళ్ల తరువాత ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా నీళ్లు అతిగా తాగినప్పుడు కూడా ఇదే పరిస్థితి రావచ్చు. మూత్రం ఏ రంగులో ఉందనేది కూడా ఆలోచించుకోవాలి. డీ హైడ్రేషన్,జాండిస్ వంటి సమస్య ఉంటే మూత్రం రంగు మారుతుంది.
రోజుకు ఎన్ని సార్లు మూత్రానికి వెళ్లవచ్చు
ఆరోగ్యంగా ఉన్న ఓ వ్యక్తి రోజుకు 5 లేదా 6 సార్లు మూత్రానికి వెళ్లవచ్చు. ఎవరైనా ఇంతకంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళితే మాత్రం ఏదో సమస్య ఉందని అర్ధం చేసుకోవాలి. తక్షణం వైద్యుని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
Also read: Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలెండర్ కోసం అప్లై చేసుకున్నారా, మరో ఛాన్స్ ఉంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి