Tips To Avoid Bird Flu: బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలి అంటే..

How To Cure Bird Flu : భారత దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో పక్షుల శవాలు గుట్టల్లా పేరుకుపోయాయి. 

Last Updated : Jan 5, 2021, 05:07 AM IST
    1. భారత దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి.
    2. అనేక ప్రాంతాల్లో పక్షుల శవాలు గుట్టల్లా పేరుకుపోయాయి.
    3. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్డ్ ఫ్లూ ఈ మేరకు కీలక పరీక్షలు నిర్వహిస్తోంది.
Tips To Avoid Bird Flu: బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలి అంటే..

How To Cure Bird Flu : భారత దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో పక్షుల శవాలు గుట్టల్లా పేరుకుపోయాయి. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్డ్ ఫ్లూ ఈ మేరకు కీలక పరీక్షలు నిర్వహిస్తోంది. ఇలాంటి సమయంలో అసలు బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏంటి? ఏం చేయాలో చూద్దాం!

Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

బర్డ్ ఫ్లూని Avian Flu అని కూడా అంటారు. H5N1 వైరస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. ఇది మనిషికి సోకితే ప్రాణాంతకం అవ్వవచ్చు. సరిగ్గా ఉడకకుండా తీసుకున్న గుడ్లు (Eggs), మాంసం వల్ల ఇది సోకవచ్చు. గుడ్డులోని పచ్చసోనా గట్టిపడే వరకు ఉడికించాలి. మాంసాన్ని 165F (74 C) ఉష్ణోగ్రతలో ఉడికించాలి.

బర్డ్ ఫ్లూ లక్షణాలు

-  దగ్గు

- జ్వరం

- గొంతు నొప్పి

- కండరాల్లో వాపు

- తలనొప్పి

- ఊపిరి తీసుకోవడంలో సమస్య

వీటితో పాటు కళ్లు తిరగడం, విరోచనాలు... కొన్ని సందర్భాల్లో కంటి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

Also Read | Honey: కల్తీ తేనె తీసుకుంటే అసలుకే మోసం, వెంటనే ఇలా టెస్ట్ చేయండి!

ఈ సమస్యలు కలగవచ్చు
- నిమోనియా

-కంజూక్టివిటీస్

- ఉపిరితిత్తుల్లో సమస్య

- కిడ్నీ సమస్యలు

- హార్ట్ డిసీజెస్

ఈ జాగ్రత్తలు తీసుకోండి
- పెంపుడు పక్షల మాంసాన్ని ఆహారంగా తీసుకోకండి. ఓపెన్ మార్కెట్, చిన్న దుకాణాల నుంచి మాంసం (Meat) కొనుగోలు చేయకండి.

- ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉండాలి అంటే తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. శానిటైజర్ అందుబాటులో ఉంచుకోండి.

-లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి.

Also Read: Aloe Vera Side Effects: అలోవెరా ఎక్కువ తీసుకుంటే సమస్యలు తప్పవు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News