Dragon Fruit Benefits: వర్షకాలం డ్రాగన్ ఫ్రూట్‌ తింటే బోలెడు లాభాలు.. ఈ వ్యాధులకు చెక్‌!

Dragon Fruit Benefits In Monsoon Season: డ్రాగన్ ఫ్రూట్‌లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. ఇవే కాకుండా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 23, 2024, 12:33 PM IST
 Dragon Fruit Benefits: వర్షకాలం డ్రాగన్ ఫ్రూట్‌ తింటే బోలెడు లాభాలు.. ఈ వ్యాధులకు చెక్‌!

 

Dragon Fruit Benefits In Monsoon Season In Telugu: డ్రాగన్ ఫ్రూట్‌తో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు ఇందులో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీని కారణంగా సీజనల్‌ వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఈ ఫ్రూట్‌లో విటమిన్ బి కూడా లభిస్తుంది. ఇది కణాల పనితీరును మెరుగుపరిచి నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా చేస్తుంది. అంతేకాకుండా డ్రాగన్ ఫ్రూట్‌ తినడం వల్ల థైరాయిడ్ హార్మోన్ల ప్రక్రియను కూడా మెరుగుపరుచుతుంది. అలాగే ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను ఆరోగ్యంగా చేసందుకు కూడా కృషి చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఫ్రూట్‌ను తినడం వల్ల ఇవే కాకుండా బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:
యాంటీఆక్సిడెంట్ల సమృద్ధి: 

డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ పండును తినడం వల్ల విటమిన్ సి, బీటా కెరోటిన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో పాటు ఇందులో ఉండే మూలకాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి బాడీని రక్షించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే ఇది గుండె జబ్బులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుదల కోసం: 
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచేందుకు కూడా సహాయపడుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
డ్రాగన్ ఫ్రూట్‌ ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి  సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: 
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్‌ కూడా ఉంటుంది. ఇది శరీరంలోని పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి రక్తపోటును తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఐరన్‌ గుండెలోని కండరాలను బలోపేతం చేసేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఫ్రూట్‌ను తినాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

చర్మానికి మేలు:
డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి చర్మానికి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ ఉండేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఇది చర్మాన్ని మెరుగుపరిచేందుకు, ముడతలు, మచ్చలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. ఇవే కాకుండా ఇందులో ఉండే విటమిన్ E చర్మాని హైడ్రేట్‌గా ఉంచేందుకు ప్రభావంతంగా తోడ్పడుతుంది.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News