Cucumber For Weight Loss And Diabetes In Summer Season: వేసవి కాలంలో అధిక మోతాదులో నీరు లభించే కూరగాయలను ఆహారంలో తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందు కంటే ఈ సమయంలో డిహైడ్రేషన్ సమస్యలతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఉదయం ఆల్పాహారంలో భాగంగానే నీటి పరిమాణాలు ఎక్కువగా లభించే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఎండా కాలంలో ప్రతి రోజు తప్పకుండా మజ్జిగ, లస్సీ, పెరుగును ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు దోసకాయను కూడా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దోసకాయలో శరీరానికి కావాల్సిన కాల్షియం, ఐరన్, జింక్, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6 అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో పాటు మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో నీటి శాతం 80 నుంచి 95 శాతం ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల శరీర సులభంగా హైడ్రేట్ అవుతుంది. దీనిని ప్రతి రోజు వేసవిలో తీసుకోవడం వల్ల ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. దీంతో పాటు మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దోసకాయలో ఉండే పోషకాల వల్ల కలిగే లాభాలేంటో ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ తినడం వల్ల లాభాలు:
డయాబెటిస్‌కి చెక్:
డయాబెటిస్‌ను నియంత్రించేందుకు దోసకాయ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ పరిమాణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రిచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు దోసకాయలో కార్బోహైడ్రేట్లు కూడా లభిస్తాయి. ఇది మధుమేహాన్ని నియంత్రించి అనేక దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
బరువు తగ్గడానికి:
దోసకాయను ప్రతి రోజు ఆల్పాహారంలో భాగంగా తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ గుణాలు పొట్టను ఆరోగ్యంగా చేసేందుకు కూడా సహాయపడుతాయి. అంతేకాకుండా సులభంగా వెయిట్‌ను తగ్గిస్తాయి.
చర్మ సమస్యలకు చెక్:
దోసకాయంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా చేసేందుకు కూడా ఎంగానో సహాయపడతాయి. దీంతో పాటు ముఖంపై మచ్చలను తొలగించడానికి ఎంతగానో ఉపయోపడుతుంది. దీంతో పాటే ముడతలు, ఫైన్ లైన్స్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు దోసకాయను తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
దోసకాయలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో పాటు పొట్ట సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే మలాన్ని మృదువుగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
అధిక రక్తపోటు:
అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారికి కూడా దోసకాయ ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా మంచి కొవ్వును పెంచేందుకు కూడా దోహదపడతాయి. కాబట్టి తప్పకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు దోసకాయను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి