Cholesterol Lowering Tips: రోజూ బ్రేక్‌‌ఫాస్ట్‌లో ఈ పదార్ధాలుంటే చాలు కొలెస్ట్రాల్ సమస్యకు చిటికెలో పరిష్కారం

Cholesterol Lowering Tips: మనిషి ఆరోగ్యం అనేది వివిధ అంశాలపై ఆదారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రధాన భూమిక వహిస్తాయి. ఆధునిక బిజీ ప్రపంచంలో పడి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి అన్‌హెల్తీ ఫుడ్స్ కారణంగా వివిధ రకాల అనాలోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 24, 2024, 09:29 PM IST
Cholesterol Lowering Tips: రోజూ బ్రేక్‌‌ఫాస్ట్‌లో ఈ పదార్ధాలుంటే చాలు కొలెస్ట్రాల్ సమస్యకు చిటికెలో పరిష్కారం

Cholesterol Lowering Tips: శరీరం ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో ముఖ్యమైనది కొలెస్ట్రాల్. ఎందుకంటే దాదాపు చాలా రకాల ప్రమాదకర వ్యాధులకు కారణం కొలెస్ట్రాల్ మాత్రమే. కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె వ్యాదులు, రక్తపోటు, మధుమేహం, కిడ్నీ వ్యాధులు సంభవించే అవకాశముంది. అన్నింటికంటే ఎక్కువగా గుండె వ్యాధులు ముప్పు పెరిగిపోతుంది. అందుకే హెల్తీ ఫుడ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.

మనిషి రోజువారీ జీవితం ప్రారంభమయ్యే బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యంగా ఉంటే రోజంతా బాగుంటుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. చాలామంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదు. ఒకటి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయకపోవడం, రెండవది హెల్తీ ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అప్పడే రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కారణంగా స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం వంటి ప్రమాదకర వ్యాధులు తలెత్తవచ్చు. 

ఆరెంజ్ అనేది మార్కెట్‌లో విరివిగా లభించే ఫ్రూట్. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. తొనలతో తింటే కావల్సినంత ఫైబర్ సమకూరుతుంది. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుంది. జ్యూస్ తాగినా అమితమైన లాభాలు కలుగుతాయి. 

గుడ్లను సాధారణంగా సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో పోషక విలువలు చాలా అధికం. పోషక పదార్ధాలు పుష్కలంగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ కావాలంటే గుడ్లు సరైన ప్రత్యామ్నాయం. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ప్రోటీన్లు కూడా కావల్సినంతగా లభిస్తాయి. గుండె వ్యాధి ముప్పు తగ్గుతుంది. 

స్మోక్డ్ సాల్మన్. ఇదో రకమైన సముద్ర చేప. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి అవసరమైన హెల్తీ ఫ్యాట్, గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. ట్రై గ్రిసరాయిడ్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. దీనికోసం టొమాటో, కేప్సికం వంటి వాటిని సాల్మన్ చేపతో కలిపి తీసుకోవచ్చు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. 

ఓట్ మీల్ అన్నింటికంటే బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పవచ్చు. దీనివల్ల కేవలం కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడమే కాకుండా మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. ఇందులో ఉండే లిక్విపైఢ్ ఫైబర్ కారణంగా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో ఆపిల్ ముక్కలు, స్ట్రాబెర్రీలు కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. 

Also read: Mudragada Padmanabham: చంద్రబాబు, పవన్ ఓటమికి ఎందాకైనా వెళ్తాను

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News