Hair Fall Remedies: కేశ సంరక్షణ అనేది రానురానూ సవాలుగా మారుతోంది. ఇది సాధారణ సమస్యే అయినా నలుగురిలో అత్యంత అసౌకర్యం కల్గిస్తుంటోంది. చిన్న వయస్సుకే హెయిర్ ఫాల్, వైట్ హెయిల్ సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ముందుగా చేయాల్సింది డైట్ మార్పు. కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఆధునిక బిజీ ప్రపంచంలో చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడి కారణంగా హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, వైట్ హెయిర్, బట్ట తల వంటి సమస్యలు అధికంగా ఉంటున్నాయి. అయితే హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా గుడ్లు, కంద, పాలకూర, ఓట్స్, క్యారెట్, కాల్షియం, వాల్‌నట్స్, ఫ్లక్స్ సీడ్స్ వంటివి కేశాల సంరక్షణలో అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటిని క్రమం తప్పకుండా మీ డైట్‌లో చేర్చితే కేశాల సమస్యలు ఇట్టే దూరమౌతాయి. ఇందులో ముఖ్యమైంది గుడ్లు. ఇందులో ఉండే ప్రోటీన్లు కేశాలు బలంగా ఉండేలా చేసే బయోటిన్‌ను ఉత్పత్తి చేస్తాయి.
ఇక క్యారెట్ కూడా చాలా ఉపయోగకరం. క్యారెట్ అనేది కేవలం కంటి ఆరోగ్యానికే కాకుండా కేశాల సంరక్షణకు సైతం దోహదం చేస్తుంది. క్యారెట్‌తో పాటు వాల్‌నట్స్, ఫ్లక్స్ సీడ్స్ తరచూ తీసుకుంటే జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ జుట్టును హెల్తీగా మారుస్తాయి. ఇక ఓట్స్ కూడా మరో అద్భుతమైన పరిష్కారం. ఇందులో ఫైబర్, ఐరన్, జింక్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు చాలా ఉండటం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు అందుతాయి.
ఇక కంద గడ్డల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. ఇక పాలకూరను రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది.
Also read: Liver Disease Symptoms: ఈ లక్షణాలు తేలిగ్గా తీసుకుంటే మీ లివర్ అవుట్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి