Kaliyugam Pattanamlo: మైండ్ బ్లాక్‌ అయ్యే ట్విస్టులు.. 'కలియుగం పట్టణంలో' మూవీ ఎలా ఉందంటే..?

Kaliyugam Pattanamlo Movie Review: కలియుగం పట్టణంలో మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2024, 11:07 AM IST
Kaliyugam Pattanamlo: మైండ్ బ్లాక్‌ అయ్యే ట్విస్టులు.. 'కలియుగం పట్టణంలో' మూవీ ఎలా ఉందంటే..?

Kaliyugam Pattanamlo Movie Review: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా.. రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కలియుగం పట్టణంలో. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీపై టీజర్, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ అయింది. నేడు (మార్చి 29) ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి కలియుగం పట్టణంలో మూవీ ప్రేక్షకులను మెప్పించిందా..? అంచనాలను అందుకుందా..? రివ్యూలో చూద్దాం..

కథ ఏంటంటే..?

నంద్యాలలో మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన (రూప లక్ష్మి) తమ కవల పిల్లలు విజయ్ (విశ్వ కార్తికేయ), సాగర్‌ (విశ్వ కార్తికేయ)లు హాయిగా జీవిస్తుంటారు. విజయ్ రక్తం చూసి భయపడితే.. సాగర్ మాత్రం సైకోలా ఆనంద పడతాడు. సాగర్ బయట తిరిగితే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో అని బాల్యంలోనే మెంటల్ హాస్పిల్‌కు పంపిస్తారు. అలా కొన్నేళ్ళు గడుస్తాయి. కాలేజీలో విజయ్ మంచితనం చూసి శ్రావణి (ఆయుషి పటేల్) ఇష్టపడుతుంది. అత్యాచారాలు చేసే క్రూర మృగాలను వేటాడి చంపుతూ ఉంటుంది. నంద్యాలలో జరిగే ఘోరాలను అడ్డుకునేందుకు పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) వస్తుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి..? అసలు విజయ్‌.. సాగర్‌లలో ఎవరు మంచి వారు.. ఎవరు చెడ్డ వారు.. అక్కడ జరిగే ఘోరాలతో వీరికి ఉన్న సంబంధం ఏంటి..? చివరకు పోలీస్ ఆఫీసర్ అక్కడి క్రైమ్‌కు చెక్ పెట్టిందా లేదా అన్నదే కథ..

ఎవరు ఎలా నటించారంటే..?

విజయ్, సాగర్ పాత్రల్లో విశ్వ తన వేరియేషన్స్ చూపించాడు. మంచి వాడిగా, సైకో వాడిలా నటించి మెప్పించాడు. కొన్ని చోట్ల భయపెట్టాడు. యాక్షన్ ఎమోషన్స్ డాన్స్ ఇలా అన్నింటిలోనూ ఆకట్టుకుంటాడు. ఆయుషి పటేల్ ఫస్ట్ హాఫ్‌లో మెప్పిస్తుంది. చిత్రా శుక్లా సెకండ్ హాఫ్‌లో ఆకట్టుకుంటుంది. ఇక నరేన్ తన పాత్రలో అద్భుతంగా నటించేశాడు. దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్ల ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి.

విశ్లేషణ

డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి కలియుగం పట్టణంలో కోసం మంచి పాయింట్, కథను తీసుకున్నాడు. క్రైమ్స్‌ను ఇలా కూడా చేయొచ్చా..? అనే భయం కలిగించేలా సినిమా ఉంటుంది. ఈ చిత్రం కోసం రాసుకున్న స్క్రీన్ ప్లే ఎంతో కొత్తగా, ఆసక్తి కలిగించేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రశ్నలు, చిక్కుముల్లతో నిండి పోయింది. వాటికి సమాధానాలు సెకండ్ హాఫ్‌లో దొరుకుతాయి. 

ఫస్ట్ హాఫ్ ఎంతో ఇంటరెస్టింగ్‌గా సాగితే.. ఆ ఊపు ఆంతగా ద్వితీయార్థంలో కనిపించకపోవచ్చు. కానీ ట్విస్టుల ఒక్కోటి రీవీల్ అవుతుంటే ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. క్లైమాక్స్ ట్విస్టులు, రెండో పార్ట్ కోసం పెట్టుకున్న కథ బాగుంది. పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలి.. ఎలా పెంచకూడదు.. తల్లిదండ్రుల పెంపకం సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు.

టెక్నికల్‌గా కలియుగం పట్టణంలో మెప్పిస్తుంది. అజయ్ పాటలు, ఆర్అర్ సినిమాకి ప్లస్. చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. ఆలోచింపజేస్తాయి. నిర్మాణ పరంగా సినిమా బాగుంటుంది. లైవ్ లొకేషన్స్ వల్ల ఫ్రేమ్స్ అన్నీ కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని అర్థం అవుతోంది.

రేటింగ్: 2.75/5.

Also Read:  Redmi Note 13 5G Price: అమెజాన్‌లో దిమ్మతిరిగే ఆఫర్స్‌..Redmi Note 13 5G మొబైల్‌ను రూ.800కే పొందండి!   

Also Read:  RR vs DC Live: పరాగ్‌ విధ్వంసంతో రాజస్థాన్ అ'ద్వితీయ' విజయం.. ఢిల్లీకి తప్పని నిరాశ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News