కరోనా వైరస్‌తో పోరాడుతున్న లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balu Health Condition) ఆరోగ్యం నిలకడగా ఉంది. వెంటిలేయర్ మీద ఎక్మో సాయంతో ఐసీయూలో ఉన్న ఎస్పీ బాలు (SP Balasubrahmanyam) వైద్యుల చికిత్సకు స్పందిస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యంపై హెల్త్ అప్డేట్ను ఎంజీఎం వైద్యులు, అనంతరం సింగర్ బాలు తనయుడు ఎస్పీ చరణ్ అందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పృహలోకి వచ్చారని, పాటలకు కాస్త స్పందిస్తున్నట్లు తెలిపారు. బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యబృందం జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. Anushka Sharma Pregnancy: తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ
Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి
కాగా, ఆగస్టు 5న కరోనా బారిన పడిన సింగర్ ఎస్పీ బాలు కుటుంబసభ్యులకు ఇబ్బంది కలగకూడదని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరడం తెలిసిందే. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా ఇటీవల ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆరోగ్యం క్షీణిస్తోందని తెలియగానే చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఎస్పీ బాలు త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. తన తండ్రి కోలుకోవడానికి 90 శాతం అవకాశం ఉందని ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఇటీవల చెప్పడం నమ్మకాన్ని ఇస్తోంది. Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
RBI Recruitment 2020: ఆర్బీఐ జాబ్స్‌కు అప్లై చేయలేదా.. మరో ఛాన్స్ వచ్చింది
COVID19 Deaths In India: భారత్‌లో 87శాతం కరోనా మరణాలు ఆ వయసు వారిలోనే..