ప్రస్తుతం భారత చలనచిత్ర పరిశ్రమ చూపులన్నీ 2.0 సినిమాపైనే ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుంది ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్.అయితే ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రజినీకాంత్ స్పీచ్ విన్న తరవాత 2.0 పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఈవెంట్లో ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన రజినీకాంత్ “ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గ్యారంటీ. కావాలంటే రాసుకోండి. నిర్మాత సుభాస్కరన్ ఈ సినిమా కోసం 600 కోట్లు ఖర్చు చేశారు. అదేదో నాకోసమో, అక్షయ్ కుమార్ కోసమో కాదు. 2.0 కోసం. దర్శకుడు శంకర్ విజన్‌ని నిజం చేయడం కోసం…” అని చెప్పారు.
‘2.0 సినిమా థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్ టైనరే కాదు, ఈ సినిమాలో ఇంటర్నేషనల్ మెసేజ్ కూడా ఉంటుందని చెప్పిన రజినీకాంత్, ఈ ప్లానెట్ జస్ట్ మనుషుల కోసమే కాదు, ప్రాణం ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి ఈ ప్లానెట్ పై బ్రతికే హక్కు ఉంది’ అని తెలిపారు సూపర్ స్టార్. నవంబర్ 29 తేదిన గ్రాండ్‌గా రిలీజవుతుంది 2.0 సినిమా. ఎమీ జాక్సన్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజర్. శంకర్ డైరెక్షన్లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై 2.0 సినిమా తెరకెక్కింది.
రజనీకాంత్ నటించిన "రోబో 2.0" చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్లో రోబో చిట్టి బ్యాంగ్‌ను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ పనితీరుగానీ, గ్రాఫిక్స్ గానీ ప్రేక్షకులను మైమరిపించేలా ఉన్నాయని ఇప్పటికే నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అన్ని రికార్డులను తుడిచిపెట్టడానికే ఈ సినిమా వస్తుందని ఇప్పటికే రజనీ అభిమానులు కొందరు జోస్యం కూడా చెబుతున్నారు.4డీ సౌండ్ టెక్నాలజీతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. భారతదేశంలో తొలిసారిగా ఈ టెక్నాలజీతో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించగా.. ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. హిందీలో ధర్మా ప్రొడక్షన్స్ ఈ చిత్ర డబ్బింగ్ హక్కులు సొంతం చేసుకుంది.